ఆంధ్రప్రదేశ్‌

కారెం శివాజీ నియామకం చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ నియామకం చెల్లదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కారెం శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ జె ప్రసాదబాబు, మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ తీర్పును వెలువరించారు. జీవో ఎంఎస్ 45 ద్వారా కారెం శివాజీని నియమించడం చెల్లదని ప్రకటించాలని వారు సవాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ నియామకంపై రాష్ట్రప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని, నిబంధనలు పాటించలేదని, దరఖాస్తులను ఆహ్వానించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ పోస్టు భర్తీ కోసం ప్రకటన జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించాలని, సెర్చ్ కమిటీని నియమించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పాటుపడిన ప్రజాప్రతినిధులు, రిటైర్డు జడ్జిలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించే విషయమై ప్రభుత్వం ఆలోచించాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్ల అర్హత, కమిషన్ చైర్మన్ శివాజీ అనర్హతపై హైకోర్టు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయదన్నారు. ఈ ఆదేశాలపై అప్పీల్ చేసేందుకు అనుమతి ఇవ్వబోమని హైకోర్టు స్పష్టం చేసింది.