రాష్ట్రీయం

ఆటామిక్ మినరల్స్ డైరెక్టర్‌గా ఎకె రాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: హైదరాబాద్‌లోని అణు ఇంధన విభాగానికి చెందిన ఆటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్, రీసెర్చ్ (ఏఎండి) నూతన డైరెక్టర్‌గా ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ అశ్వినీ కుమార్ రాయ్ (ఏకె రాయ్) గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ పదవిలో కొనసాగిన పిఎస్ పరిహార్ పదవీ విరమణ చేయడంతో రాయ్ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏఎండి డైరెక్టర్ హోదాలో డాక్టర్ రాయ్ భారత్‌లో యురేనియం, అణు ఇంధన ఖనిజాల అనే్వషణ కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పన, పర్యవేక్షణ, మార్గ నిర్దేశం తదితర బాధ్యతలు నిర్వహిస్తారు. డాక్టర్ రాయ్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్, రీసెర్చ్ సంస్థలో 1979లో చేరారు. ఆయన బనారస్ విశ్వవిద్యాలయం నుంచి జియాలజీ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. మధ్య, దక్షిణ తూర్పు, పశ్చిమ, ఈశాన్య భారతంలో అణు ఇంధన ఖనిజాల అనే్వషణలపై ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా తుమ్మల పల్లెలో రెండో దశ యురేనియం అనే్వషణ కార్యక్రమ ప్రారంభంలో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ రాయ్ చేసిన సేవలకు గుర్తింపుగా నేషనల్ జియో సైన్స్ పురస్కారం, ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ 2014 అవార్డు, డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గ్రూప్ అచీవ్‌మెంట్ పురస్కారాలు లభించాయి.