రాష్ట్రీయం

అవుట్‌లుక్‌పై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్య తరపున భర్తకు కేసు పెట్టే హక్కు లేదు
స్పష్టం చేసిన హైకోర్టు * స్మితా సభర్వాల్‌కు చుక్కెదురు
హైదరాబాద్, డిసెంబర్ 31: అవుట్‌లుక్ మ్యాగజైన్ యాజమాన్యంపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సిఎంఒ అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్ భర్త ఐపిఎస్ అధికారి అకున్ సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. తన భార్యపై అవుట్‌లుక్ మ్యాగజైన్ కార్టూన్ వేసినందుకు అకున్ సభర్వాల్ పెట్టిన కేసులో క్రిమినల్ ప్రొసిడింగ్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివకుమార్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ పోలీసు స్టేషన్ పోలీసులు అవుట్‌లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ ఎడిటర్ మాధవి తాత, కార్టూనిస్టు సాహిల్, గ్రూప్ చైర్మన్ ఇంద్రాణిల్ రాయ్‌పై కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ గ్రూపు సంస్ధల యాజమాన్యం 2015 జూన్‌లో కేసును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
స్మితా సభర్వాల్ భర్త అకున్ సభర్వాల్‌కు పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు లేదని కోర్టు అభిప్రాయపడింది. బాధితురాలైన స్మితా సభర్వాల్‌కు మాత్రమే న్యాయపరంగా, పోలీసుపరంగా ఫిర్యాదుచేసే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. ఒక వేళ ఈ కేసులో అకున్ సభర్వాల్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి పోలీసులు ఫిర్యాదుచేస్తే, చట్టాన్ని దుర్వినియోగం చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. ఈ అభిప్రాయంతో కేసును కొట్టివేస్తున్నామని, కాని బాధితురాలు అందుబాటులో ఉన్న చట్ట ప్రకారం న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది.