రాష్ట్రీయం

నేటి నుంచి విజయవాడలో 27వ పుస్తక మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 31: పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న 27వ పుస్తక మహోత్సవం నూతన సంవత్సరం ఆరంభం రోజున విజయవాడ స్వరాజ్య మైదానం ప్రాంగణంలో ప్రారంభం కాబోతున్నది. పుస్తక పఠనం తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో దీనిపై ఎంతో శ్రద్ధ వహించాల్సిన ప్రభుత్వం ముందెన్నడూ లేని విధంగా ఈ పుస్తక మహోత్సవం నిర్వహణకు ఆంక్షలు విధిస్తూ వచ్చింది. సమీపంలోనే సిఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు కావటంతో సెక్యూర్టీ పేరుతో మే 5వ తేదీన అనుమతి కోరుతూ బుక్ ఫెస్టివల్ సొసైటీ దరఖాస్తు చేసుకోగా తీరా ఈ ఉత్సవం ప్రారంభం కాబోయే కొన్ని గంటలు ముందుగా గురువారం అనుమతి లభించింది. దీనికితోడు విస్తీర్ణాన్ని మూడో వంతుకు తగ్గించడంతో గతంలో 389 స్టాల్స్‌కు ఏర్పాటుకు విశాలమైన ప్రాంగణం ఉండగా ఈ దఫా తగినంత విస్తీర్ణం లేక కేవలం 235 దుకాణాలకే ఈ మహోత్సవం పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని సొసైటీ అధ్యక్షుడు బెల్లపు బాబ్జీ తెలిపారు. దివంగత మువ్వుల పెరునాళ్ళు పేరిట ఏర్పాటైన ప్రాంగణంలోని చలసాని ప్రసాద్ సాహిత్య వేదికపై శుక్రవారం సాయంత్రం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, సాహిత్య విమర్శకులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. 4వ తేదీ సాయంత్రం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్ నుంచి జరిగే పుస్తక ప్రియుల పాదయాత్రలో పలురంగాల ప్రముఖులు పాల్గోనున్నారు. 5వ తేదీ సాయంత్రం దివంగత బుచ్చిబాబు శతజయంతి సభ జరుగనున్నది. 11వ తేదీ సాయంత్రం జరిగే ముగింపు సభలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గోనున్నారు. సొసైటీ అధ్యక్షుడు బి. బాబ్జీ, ఉపాధ్యక్షుడు కె.లక్ష్మయ్య, కార్యదర్శి ఎబిఎస్ సాయిరాం, సంయుక్త కార్యదర్శి బి.రవికుమార్, కోశాధికారి జె.శ్రీనివాస్, మాజీ అధ్యక్ష, కార్యదర్శులు రావికింద రామస్వామి, వెంకటనారాయణ తదితరులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.