తెలంగాణ

కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 8: బోధన ఫీజుల బకాయిలు, ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్‌చేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులను నెట్టివేసి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లి కలెక్టర్ చాంబర్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించడం సంచలనం రేకెత్తించింది. మొత్తంగా ఈ వ్యవహారం అటు అధికారులు, ఇటూ పోలీసుల మధ్య వివాదానికి తెరలేపింది. రాష్టవ్య్రాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం పెండింగ్ బోధన ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టిజివిపి ఆధ్వర్యంలో మంగళవారం పెద్దసంఖ్యలో విద్యార్థులు జిల్లా కేంద్రానికి సమీపంలో గల దురాజ్‌పల్లి గ్రామం వద్ద ఉన్న కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్ ద్వారం ముందు విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న కొందరు పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లి కలెక్టర్ చాంబర్‌లోకి ప్రవేశించి కుర్చీలు, సీలింగ్‌ను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కలెక్టర్ కార్యాలయంలో లేకపోవడాన్ని గమనించిన విద్యార్థి సంఘం నేతలు చాంబర్‌లోకి వెళ్లి విధ్వంసానికి దిగారు. ఈ ఘటనపై కలెక్టరేట్ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకొని విధ్వంసం సృష్టించిన విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జెసి సంజీవరెడ్డి ధ్వంసమైన కలెక్టర్ చాంబర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ చాంబర్‌ను ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ కార్యాలయానికి తగిన భద్రత కల్పించాలని తాము వారంరోజుల క్రితమే జిల్లా ఎస్పీని లిఖితపూర్వకంగా కోరామని, అయినప్పటికీ సరైన భద్రత కల్పించకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ పరిమళ హనా నూతన్‌ను వివరణ కోరగా విధ్వంసం ఘటనలో పోలీస్ వైఫల్యమేమీ లేదని చెప్పారు. కలెక్టరేట్ వద్ద భద్రత ఏర్పాటుచేశామని, విధ్వంసం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను పంపామన్నారు. కలెక్టరేట్‌కు నిరంతర భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ కోరారని, ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కలెక్టరేట్ నిర్మానుష్య ప్రాంతంలో ఉండటం వల్ల భద్రతపరంగా తలెత్తే సమస్యలపై సాంకేతికంగా పరిశీలిస్తున్నామన్నారు. కాగా, ఈ విధ్వంసానికి పాల్పడిన టిజివిపి జిల్లా అధ్యక్షుడు సురేష్‌తో పాటు 15 మందిపై కలెక్టరేట్ అధికారుల ఫిర్యాదు మేరకు చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట రూరల్ సిఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

చిత్రాలు..సూర్యాపేటలో కలెక్టరేట్‌లో ఛాంబర్‌ను పరిశీలిస్తున్న జెసి సంజీవరెడ్డి, పోలీస్ అధికారులు
కలెక్టర్ చాంబర్‌లో ధ్వంసమైన ఫర్నిచర్...దూసుకెళ్తున్న టిజివిపి కార్యకర్తలు..