ఆంధ్రప్రదేశ్‌

సర్దేసుకుని రద్దు నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 9: దేశంలో నల్లధనం నివారించే పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం చూస్తే ప్రధాని మోదీ, సి ఎం చంద్రబాబు నాయుడుతోపాటు తమవారంతా అంతా సర్ధుకున్నట్లు కనిపిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అరోపించారు. బుధవారం తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దును తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే నెల క్రితం చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాయడం, ఆ తరువాత మోదీ ప్రకటన చూస్తే వారికి కావాల్సిన వారు ముందుగా అంతా సర్దుకున్నట్లు కనిపిస్తోందన్నారు.