కరీంనగర్

జెఎన్టీయు విద్యార్థుల ‘అడ్డదారి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటినరికాలనీ, నవంబర్ 17: రామగిరి మం డలం సెంటినరికాలనీలోని జెఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బయటకు వెళ్లేందుకు రహదారి ఉన్న ‘‘అడ్డదారి’’లో ప్రహరీ గోడ దూకుతున్నారు. రూ.2.50 కోట్లతో కళాశాల చుట్టు ప్రహరీ గోడ నిర్మించారు. బాయ్స్ హస్టల్ విద్యార్థులు ప్రతి నిత్యం సెంటినరికాలనీకి వచ్చిపోతు ఉంటారు. హస్టల్స్ నుండి కళాశాల అకాడమిక్ బ్లాక్ పక్క నుండి ప్రధాన రహదారి దూరమవుతుందనే ఉద్దేశ్యంతో ‘‘అడ్డదారి’’ని వెతుకుతున్నారు. హస్టల్ పక్కనే ఉన్న ప్రహరీ గోడకు ఇరువైపులా రాళ్లు, ఇటుకలు, నిచ్చెనలు వేసుకోని గోడపైకి ఎక్కి దూకుతున్నారు. విద్యార్ధులు గోడ ఎక్కి దిగే ప్రాంతంలో చెత్తచెదారం భారీగా ఉంది.విష కీటకాలు ఈ ప్రాం తంలో తిరుగుతాయి.రాత్రి వేళ ఏదైనా కీటకం కుట్ట డం లేదా గోడ మీది నుంచి పడి గాయాలపాలైయి తే భాద్యత ఎవరిది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్న ప్రిన్సిపాల్‌కు ఏమి పట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ హస్టల్స్‌కు కేర్‌టేకర్‌లు ఉన్న విద్యార్థులు గోడ దూకి వెళ్లుతున్న పట్టించుకోనే నాధుడే కరువైయ్యారు. కళాశాలకు రావడానికి విద్యార్థులు నిరుత్సాహనికి గురవుతారు.