కృష్ణ

సహకార ఉద్యోగుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, నవంబర్ 18: అఖిల భారత సహకార ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు శుక్రవారం స్థానిక సహకార బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగులు బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడిసిసి బ్యాంకు ఉద్యోగులు ఈనిరసన కార్యక్రమంలో పాల్గొని కేడిసిసి బ్యాంకు ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరశించారు. కేడిసిసి బ్యాంకులలో పెద్దనోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వాలని సిబ్బంది రైతులతో కలిసి డిమాండ్ చేశారు. అదేవిధంగా డిసిసిబీలపై ఆర్‌బీఐ నిషేధాన్ని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. మేనేజర్ కోటయ్యతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
వరి కోతలు ప్రారంభం
కృత్తివెన్ను, నవంబర్ 18: మండల పరిధిలోని పంట కాలువనే ఆనుకుని ఉన్న చెరుకుమిల్లి, ఎండపల్లి, చినపాండ్రాక, కృత్తివెన్ను గ్రామాలలో రైతన్నలు వరి కోతలు ప్రారంభించారు. ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందించకపోయినా కన్నీళ్ళ కష్టంతో ఖరీఫ్ సాగును పూర్తి చేశారు. బిపిటి 5204 వరి రకం పైరు కోతలకు సిద్ధం కావటంతో కోతలను ప్రారంభించారు. కొంత మంది రైతులు యంత్రాలతో కోతలు కోయగా, మరి కొంత మంది సాంప్రదాయబద్ధంగా కోతలు కోస్తున్నారు. అయితే ప్రభుత్వం దాళ్వాపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవటంతో రైతన్నలు మినుము పంటపై ఆసక్తి చూపుతున్నారు.