రాష్ట్రీయం

లెక్చరర్ వేధింపులు.. సీనియర్ల ర్యాగింగ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 18: ర్యాగింగ్ భూతం మరో బిటెక్ విద్యార్థిని బలిగొంది. సీనియర్ విద్యార్థినులు, ఓ లెక్చరల్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన కడప జిల్లా బద్వేలు మండలం బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బీరం జయరామిరెడ్డి కుమార్తె బీరం ఉషారాణి (19) వాస్మోల్ తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఆర్‌జిఎం ఇంజినీరింగ్ కాలేజిలో ఉపారాణి బిటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ర్యాగింగ్, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉషారాణి కాలేజి హాస్టల్‌లో ఉంటోంది. ఆమెపై కనే్నసిన ఓ లెక్చరల్ వేధించడం మొదలు పెట్టాడు. దీనికి తోడు సీనియర్లు ర్యాగింగ్ చేసేవారు. ఉషారాణితో పాటు హాస్టల్ గదిలో ఉంటున్న విద్యార్థినుల సాయంతో ఆమె ఫొటోలు తెప్పించుకుని వాటిని చూపించి వేధించేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఎవరికీ చెప్పుకోలేక లోలోన మధనపడుతూ ఉండేది. కళాశాల వాతావరణం బాగాలేదని, తాను హాస్టల్‌లో ఉండలేనని, ఇంటికి వచ్చేస్తానని ఉపారాణి పలుసార్లు తల్లిదండ్రులతో చెప్పింది. అయితే భవిష్యత్తు దృష్ట్యా చదువుపై మనసు లగ్నం చేయాలని వారు సర్దిచెప్పడంతో తిరిగి వచ్చేది. ఈ క్రమంలో ఇటీవల కళాశాల నుంచి వచ్చేస్తానని తండ్రికి చెప్పడంతో బద్వేలుకు తీసుకువచ్చారు. గురువారం తిరిగి కళాశాలకు తీసుకెళ్లగా హాస్టల్ గదిలోకి వెళ్లిన ఉషారాణి కొద్దిసేపటికే తిరిగివచ్చి తాను కళాశాలలో ఉండనని ఇంటికి వెళ్తామని చెప్పడంతో చేసేదిలేక తండ్రి వాహనంలో బయలుదేరారు. హాస్టల్ గదిలోకి వెళ్లిన ఉషారాణి వెంట తెచ్చుకున్న వాస్మోల్ తాగడంతో మార్గమధ్యంలో ఆళ్లగడ్డ సమీపంలోకి చేరుకోగానే వాంతులు చేసుకుంది. దీంతో ఆందోళనకు గురైన తండ్రి ఏం జరిగిందని ప్రశ్నించగా కాలేజిలో ర్యాగింగ్ చేస్తున్నారని, ఓ లెక్చరర్ వేధిస్తున్నాడని అందుకే వాస్మోల్ తాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పి అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే ఉషారాణిని ఆళ్లగడ్డలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స జరిపించారు. అనంతరం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కళాశాలలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు ఓ అధ్యాపకుడు వేధించడం వల్లే తమ బిడ్డ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఉషారాణి తల్లిదండ్రులు ఆరోపించారు. తన కుమార్తె మృతికి కళాశాల యాజమాన్యం, అధ్యాపకుడే కారణమని తండ్రి జయరామిరెడ్డి, బంధువులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉషారాణి సోదరి శిరీష బద్వేలు జడ్పీటిసి సభ్యురాలు. విషయం తెలియగానే పలువురు టిడిపి నాయకులు ఇంటికి చేరుకుని జయరామిరెడ్డిని పరామర్శించారు.
నిరసనల హోరు
పాణ్యం: ఆర్‌జిఎం విద్యార్థిని ఉపారాణి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియగానే విద్యార్థి సంఘాలు శుక్రవారం కళాశాల ఆవరణలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. ఉపారాణి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, కాలేజిలో ర్యాగింగ్‌ను అరికట్టాలని వారు నినాదాలు చేశారు. విద్యార్థిని ఆత్మహత్యపై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. విచారణ జరిపించాలని ఆయన ఆదేశించడంతో కర్నూలు డిఐజి రమణకుమార్, ఓఎస్‌డి రవిప్రకాష్ శుక్రవారం సాయంత్రం కళాశాలకు చేరుకుని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. కళాశాలలో ఇప్పటి వరకు ర్యాగింగ్ జరిగిన దాఖలాలు లేవని కాలేజి యాజమాన్యం పేర్కొంది. ఉషారాణి మృతిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు డిఐజి తెలిపారు.

చిత్రం.. ఆత్మహత్య చేసుకున్న ఉషారాణి