రాష్ట్రీయం

ఒత్తిడి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 18: చదువులో మరింత రాణించాలంటూ ఉపాధ్యాయులు చేసిన ఒత్తిడి భరించలేక ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మోతీనగర్‌లో నివాసం ఉండే ఎల్లయ్య బోరబండలోని ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని కుమార్తె శ్రీ వర్ష (17)ను గత సంవత్సరం ఎస్‌ఆర్ నగర్‌లోని నారాయణ కాలేజీలో చేర్పించారు. ఆమె మొదటి సంవత్సరంలో 92 శాతం మార్కులు సాధించింది. ఉత్తమ మార్కులు సాధిస్తున్న ఆమెను మరింత చదవాలంటూ కాలేజీ ప్రిన్సిపాల్ ఉమ, ఫిజిక్స్ లెక్చరర్ ప్రేమ్‌కుమార్ నిత్యం ఒత్తిడి తేసాగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీవర్ష గురువారం రాత్రి తాను నిద్రిస్తున్న గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒత్తిడికి గురిచేయడం వల్లనే తమ కుమార్తె మృతి చెందిందని ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు ఉమ, ప్రేమ్‌కుమార్‌లపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే విద్యార్థిని మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు, బాలల హక్కుల సంఘం కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపాయి.