తెలంగాణ

కెసిఆర్ పాలన ప్రజాకంటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుంటే కెసిఆర్ నేతృత్వంలోని తెరాస సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజల తిరస్కారానికి గురవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వేముల అశోక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ, సూర్యాపేట, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల అధ్యక్షుల నియామకాలను పూర్తి చేశామన్నారు. సంస్థాగతంగా పోలింగ్ బూత్ మొదలు మండల కమిటీలు పూర్తి చేసుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా పూర్తి చేశామని, ప్రజా సమస్యలపై త్వరలో అన్ని జిల్లాల్లో ఉద్యమాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు. వివిధ మోర్చాలు ఉద్యమాలు, పోరాటాల ద్వారానే ప్రజలకు చేరువ కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై అశోక్ పోరాటాలు చేయాలని, ఆ విధంగానే దళిత వర్గాల మెప్పు పొందాలని లక్ష్మణ్ సూచించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయడంతో పాటు దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్న హామీలను తుంగలో తొక్కిన కెసిఆర్ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో వారు ఉన్నత చదువులను నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులతో పాటు రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రుణ మాఫీ ప్రకటన రైతులకు గుదిబండగా మారిందని, మొత్తం మీద కెసిఆర్ సర్కారు పాలన ప్రజాకంటకంగా మారిందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దేశ, విదేశాల్లోని పత్రికలు, ప్రజలు కొనియాడుతుండటాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. దళితులు, పేద మహిళ సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే ‘స్టాండప్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆయన చెప్పారు. వేముల అశోక్ మాట్లాడుతూ, లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. నోట్ల రద్దును కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్లను అవమాన పరిచే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.