ఆంధ్రప్రదేశ్‌

సత్యసాయి జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 18: పుట్టపర్తి సత్యసాయి జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేణుగోపాలస్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. తొలుత ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభామండపంలోని సత్యసాయి మహాసమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సమాధిని రకరకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం వేణుగోపాలస్వామి, ఆంజయనేస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహించి అందంగా అలంకరించిన రథంపై ఆశీనులను చేశారు. సాయి నామస్మరణ మధ్య ఈశాన్యగోపురం నుంచి రథం ముందుకు కదిలింది. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఆర్‌జె రత్నాకర్, చక్రవర్తి, నరేంద్రనాథ్‌రెడ్డి, కార్యదర్శి ప్రసాదరావు, మంత్రి పల్లెరఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశవిదేశాల నుంచి నుంచి వచ్చి సత్యసాయి భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ట్రస్టు సభ్యుడు రత్నాకర్ మాట్లాడుతూ ప్రశాంతినిలయంలో సత్యసాయిబాబా విగ్రహం ఏర్పాటు చేయడం లేదన్నారు. సత్యసాయి మహాసమాధి వద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు చాలామంది భక్తులు విముఖత చూపారన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని విగ్రహం ఏర్పాటుపై ఒక అభిప్రాయానికి వచ్చామన్నారు.

చిత్రం.. పుట్టపర్తిలో జరిగిన వేణుగోపాలస్వామి రథోత్సవంలో
పాల్గొన్న ట్రస్టు సభ్యులు రత్నాకర్, మంత్రి పల్లె తదితరులు