ఆంధ్రప్రదేశ్‌

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, నవంబర్ 19: ఫసలీ బీమా యోజన సహా పలు పథకాలు ప్రవేశపెట్టిన తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని చాటిచెప్పడానికే ఈ నెల 26న లక్షమంది రైతులతో ‘రైతుసభ’ నిర్వహిస్తున్నామని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ సభలో పాల్గొని రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో కలిసి శనివారం కంభంపాటి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా గతంలో యూరియాను పారిశ్రామిక అవసరాలకు వినియోగించేవారని, దీనివల్ల రైతులు నిత్యం కొరత ఎదుర్కొనేవారన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ యూరియాకు వేపపూత పూయిస్తున్నారని, దీనివల్ల రైతులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే తక్కువ ప్రీమియంతో రైతులకు ఉపయోగపడేలా ప్రధాని ఫసలీ బీమా యోజన ప్రవేశపెట్టారన్నారు. దీనివలన పకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన రైతాంగానికి అత్యధిక ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయ అవసరాలకు రైతులకు ఆరు శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు అందిస్తున్నారన్నారు. టన్నుకు రూ.5,200 పడిపోయిన ఆయిల్ పామ్ ధరను రూ.7880కు పెంచడం తమ ప్రభుత్వ ఘనతేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలాలను విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ప్రధాని నరేంద్ర మోదీ తొలగించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రమే భరిస్తుందని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. వివిధ పథకాల ద్వారా రైతులకు రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చడానికి ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న కృషిని ఈసభ ద్వారా రైతులకు వివరిస్తారన్నారు. పెద్దనోట్లు రద్దును బడుగు, బలహీన, మధ్యతరగతి ప్రజలు స్వాగతిస్తున్నారని కంభంపాటి పేర్కొన్నారు.
నోట్ల రద్దుతో నల్లధనానికి చెల్లుచీటి
విజయవాడ: 2014లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేనాటికి ఈ దేశంలో రైతులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని వాటి పరిష్కారానికి పలు కార్యక్రమాలు, పథకాలను ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేస్తోందని ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో ఈ నెల 26న జరిగే రైతు మహాసభలో అమిత్‌షా పాల్గొంటారని బిజెపి మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, పురంధ్రీశ్వరి తెలిపారు. శనివారం నాడిక్కడ జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయం ఖర్చు తగ్గించి రైతులకు ఉత్పత్తి పెరిగేలా చేసేందుకు సాయిల్ హెల్త్‌కార్డులు అందచేస్తోందన్నారు. రైతులకు భారీగా రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రూ.16లక్షల కోట్ల ధనంలో రూ.3నుంచి రూ.4 లక్షల కోట్ల రూపంలో ఉన్న నల్లధనం చెల్లనిదైపోతుందన్నారు. మాజీ ఆర్థిక మంత్రులు చిదంబరం, మన్మోహన్‌సింగ్ నోట్ల రద్దును తప్పుపట్టలేదని అమలులో జాగ్రత్త వహించాలని సూచించినట్లు తెలిపారు.

చిత్రం.. ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎంపి కంభంపాటి, మంత్రి మాణిక్యాలరావు