తెలంగాణ

పచ్చపచ్చని పాలమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 19: జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి పాలమూరును పదికాలాలపాటు పచ్చగా ఉంచాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ ఎన్ని కోట్ల నిధులు ఖర్చయినా పూర్తిచేస్తామన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు ఇప్పటికి రూ.270 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.500 కోట్లు ఖర్చు చేసి 2లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నెట్టెంపాడు భూ సేకరణ ప్రక్రియలో 1200 ఎకరాలు పెండింగ్‌లో ఉందని రైతులు సహకరిస్తే నడిగడ్డను సస్యశ్యామలం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను అడ్డుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్నూల్ కాంగ్రెస్ నేతలేనని ఆయన ఆరోపించారు. ఒక పక్క ఆర్డీఎస్‌కు నీరు రాకుండా, వచ్చిన నీటిని దోచుకుంటున్న కాంగ్రెస్, టిడిపి నేతలు ఇక్కడి రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు చేయడం వల్ల గద్వాలలో 18 చెరువులు నిండాయన్నారు. కేంద్ర ప్రభు త్వం పత్తికి మద్దతు ధర రూ.4,160 ఇస్తుందని, బయటి మార్కెట్‌లో రూ.5వేలు అమ్ముతున్నారని, సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. గద్వాలలో పత్తి మార్కెట్ ఉన్నప్పటికీ కొనుగోలు జరగకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ వారం రోజుల్లో కొనుగోలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గద్వాలలో రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రూ.30 లక్షలు మంజూరు చేయగా అవసరమైతే మరో రూ.30 లక్షలు మంజూరు చేసేందుకు సిద్ధం గా ఉన్నామన్నారు. మార్కెట్‌యార్డులో రైతుల సౌకర్యార్థం బ్యాంకును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, ప్రస్తుతం ఉన్న రైతు విశ్రాంతి భవనం ఐటిఐ కళాశాలకు కేటాయించడంతో అదనంగా మరో విశ్రాంతి భవనాన్ని మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. మహిళా, పురుష రైతులకు విడివిడిగా అన్ని హంగులతో విశ్రాంతి భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్‌యార్డులో నిర్మించిన గోదాములను ఆయన ప్రారంభించారు.
గద్వాల వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్‌గా రిజర్వేషన్‌లో మహిళకు కేటాయించి లక్ష్మిదేవికి ఎంపిక చేయడం ముఖ్యమంత్రి కెసిఆర్‌కె దక్కిందని మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. లక్ష్మిదేవి ధైర్యవంతురాలని మార్కెట్‌యార్డుకు వచ్చే రైతు సంతోషంగా ఇంటికి వెళ్లేందుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా లక్ష్మిదేవి భర్త చంద్రశేఖర్‌రెడ్డి సహకారంతో వ్యవసాయ మార్కెట్‌యార్డు అభివృద్ధికి తనను కలవాలని సంపూర్ణంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

చిత్రం.. గద్వాల మార్కెట్‌యార్డులో గోదాంలను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు