రాష్ట్రీయం

టాంజానియాలో ఐఎన్‌ఎస్ దర్శక్ హైడ్రాలిక్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 29: తూర్పు నౌకాదళానికి చెందిన సర్వే నౌక ఐఎన్‌ఎస్ దర్శక్ టాంజానియాకు చెందిన టాంగా పోర్టులో హైడ్రాలిక్ సర్వే విజయవంతంగా పూర్తి చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరి ఒప్పందంలో భాగంగా హైడ్రోగ్రాఫిక్ సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకునే విధంగా సర్వే నిర్వహించారు. సర్వే ద్వారా ఇరుదేశాల్లో అభివృద్ధి, సహకారం పెంపొందించే అవకాశాలు పెరిగాయి. సామర్థ్యం పెంపు, వౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా చేపట్టిన సర్వే పూర్తి చేశారు. దర్శక్ అధికారులు తమ తొలివిడత సర్వే వివరాల నివేదికను టాంగా హార్బర్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో టాంజానియా ప్రభుత్వానికి నివేదించారు. భవిష్యత్‌లో పైప్‌లైన్ విస్తరణ, ఇతర అంశాలను సైతం నివేదికలో పేర్కొన్నారు. ఐఎన్‌ఎస్ దర్శక్ నెల రోజులకు పైబడి హైడ్రాలిక్ సర్వే నిర్వహించింది. టాంజానియాలో సర్వే విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐఎన్‌ఎస్ దర్శక్ మరో సర్వే నిమిత్తం మారిషస్ బయలుదేరి వెళ్లింది.

చిత్రం..టాంజానియాకు వెళ్లిన ఐఎన్‌ఎస్ దర్శక్