గుంటూరు

భూ కేటాయింపులపై వైసిపి వైఖరి వెల్లడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 2: రాష్ట్రంలో పరిశ్రమలకు భూ కేటాయింపులపై వైసిపికి ఒక విధానమంటూ లేదని, దీనిపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వేగంగా అభివృద్ధి సాధించేందుకు పరిశ్రమల ఏర్పాటు చాలా ముఖ్యమన్నారు. కొత్త రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో భూములు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. భూములు కేటాయిస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు. ఇందుకు ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి అడ్డుపడుతూ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతులను కూడా భాగస్వాములను చేయడం మంచి విధానమన్నారు. పోలవరం, పట్టిసీమ, అమరావతి నిర్మాణం, భోగాపురం, బందర్ ఎయిర్‌పోర్ట్‌లను అడ్డుకుంటున్నారన్నారు. జగన్మోహనరెడ్డి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. దేవుడు దయతలిస్తే ఎన్నికలు మరో సంవత్సరంలో వస్తాయనడం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయన్న విషయాన్ని కూడా ఆయన గుర్తెరగాలన్నారు. ఇటీవల జరిపిన సర్వేల్లో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నట్లు వెల్లడైందన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు మరో మూడున్నర లక్షల పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామమన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను విస్తరింపజేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని మాణిక్య వరప్రసాద్ అన్నారు. బంగారంపై కేంద్రం ఆంక్షల నేపథ్యంలో మహిళల్లో ఆందోళన ఉందని, దీనిపై కేంద్రం అందరితో చర్చిస్తే బాగుంటుందని, మహిళల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై కేంద్రంతో ముఖ్యమంత్రి చర్చించాలన్నారు. కేంద్ర ఖజానాకు వస్తున్న డబ్బులను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు.