బిజినెస్

పన్ను విధానాలు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 4: నల్లధనం నిరోధానికి పన్ను చట్టాల మార్పు అవసరం ఎంతైనా ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం పన్ను చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న ఆయన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. నల్లధనం కట్టడికి అవలంభించాల్సిన చర్యల్లో ఒకటి మాత్రమేనని, ఇలాంటి నిర్ణయాలు మరెన్నో తీసుకోవాల్సి ఉందని అన్నారు.
ఈ క్రమంలోనే నల్లధనం నిర్మూలనకు పన్ను విధానాలను సంస్కరించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఓ ప్యానెల్ డిస్కర్షన్‌లో పాల్గొన్న ఆయన మన పన్ను చట్టాల్లో ఎన్నో లోపాలున్నాయని వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే ప్రజలు స్వచ్చంధంగా పన్నులు చెల్లించేందుకు ముందుకు రావాలని, అలా రావాలంటే పన్నులు సరళతరంగా, ఆమోదయోగ్యంగా ఉండాలని అన్నా రు. పన్ను చెల్లింపుదారులు పన్నుల ను భారంగా భావించకుండా సంస్క రణలు తేవాలన్న ఆయన స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటి నిర్ణయాలు కీలకమన్నారు.