తెలంగాణ

చావుకూ చుక్కలు చూపుతున్న పెద్ద నోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అన్ని విధాలుగా ఆటంకం కల్గిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెళ్లిళ్లు, పేరంటాలకే కాదు, చివరకు తుది శ్వాస విడిచిన వ్యక్తుల అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించడానికి పెద్ద సంకటం కల్పిస్తోంది. ఎటిఎంలు పని చేయకపోగా, పని చేసే ఎటిఎంలలో పరిమితికి మించి డబ్బులు అందకపోవడం, బ్యాంకుల వద్ద బారులు తీరుతుండటంతో చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు నానా అవస్థలకు గురవుతున్నారు. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల నిర్వహణకు అవసరమైన అన్ని వస్తువులను బయట నుండి మాత్రమే కొనుగోలు చేసి కార్యక్రమాలను పూర్తి చేయడం ఆనవాయితీ. చావు మినహా మిగిలిన కార్యక్రమాలన్నింటికీ వాయిదాలు వర్తించినా ఇక్కడ మాత్రం అన్ని అక్కడికక్కడే జరిపించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా నగదు డబ్బు అవసరం పడుతోంది. స్వైప్ యంత్రాలు అన్ని దుకాణాల్లో అందుబాటులో లేకపోవడం, ఫోన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన లేకపోపోవడంతో నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా చూపిస్తోంది. చివరకు కాటి కాపరికి సైతం నగదు చెల్లించాల్సి ఉండగా అక్కడ కూడా విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలపై పెద్ద నోట్ల రద్దు తీవ్రత ఆగమ్యగోచరంగా ఉంది. కిరాణం, వస్త్ర దుకాణాలు, పంక్షన్‌హాల్, బ్యాండుమేళాలు, పురోహితులు, కూరగాయల కొనుగోలు తదితర అన్ని రకాలపై పెను ప్రభావం చూపిస్తోంది. బ్యాంకుల నుండి నగదు విత్‌డ్రాలకు పరిమితులు విధించడంతో లావాదేవిలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఉద్యోగులకు నెల వారి వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు సెల్‌ఫోన్ల ద్వారా మెస్సేజ్‌లు వచ్చినట్లేకానీ అవసరమైనంత మేరకు నగదును విత్ డ్రా చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఎవరు కూడా వర్ణించలేకపోతున్నారన్నది నిత్యసత్యంగా మారింది. పాలు, నీళ్లు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, టెలిఫోన్, సెల్‌ఫోన్ చార్జీలు, కిరాణ దుకాణాల్లో చెల్లింపులు, రవాణా ఖర్చులకు సరిపోను డబ్బులు లేక ప్రతి రోజు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలుగు మాసాలకు అనుగుణంగా ఆయా వర్గాలకు చెందిన వారు ముందస్తుగానే ప్రణాళికలు సిద్దం చేసుకున్న వారు కూడా తమ తీర్థయాత్రలను అర్ధాంతరంగా రద్దు చేసుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమ ఇంట్లో వ్యక్తి చనిపోయాడు..సదరు వ్యక్తి దహన సంస్కారాలకు డబ్బు అత్యవసరమని, ఆ డబ్బును సమకూర్చాలని బ్యాంకు మేనేజర్ల వద్దకు వెళ్లి మోకరిళ్లినా కనీస దయాదాక్షిణ్యాలు చూపించకపోగా, చావు, పుట్టుకలనే సెంటిమెంట్లు తమ వద్ద పని చేయవని, అందరికి ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని, క్యూ లైన్లలో నిల్చోవాలని తెగేసి చెబుతున్నారు. ఇటీవల జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఓ మనిషి చనిపోయిన సంఘటనలో సంబంధిత కుటుంబ సభ్యులు నగదు డబ్బు కోసం అనేక అవస్థలకు గురైన సందర్భం ఆంధ్రభూమి ప్రతినిధి దృష్టికి కనిపించడం విశేషం. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అన్ని వర్గాల వారికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు.