కృష్ణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, డిసెంబర్ 4: మండలంలో కూలీలతో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా మరోపక్క యంత్రాలతో అదేరీతిలో కోతలు కోస్తుండటంతో కళ్ళాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. యంత్రాలతో కోతకోయటంతో వెంటనే ధాన్యం రాశులు సిద్ధమవుతున్నాయి. నాలుగు రోజులు ఆరబెట్టి అమ్మేద్దామను కుంటున్న రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. పెద్దనోట్ల రద్దుతో ప్రైవేటు వ్యాపారులు ముందుకు రాక, మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బేల చూపులు చూస్తున్నారు. దాళ్వావరి వేసే రైతులు యంత్రాలతో సార్వా వరికోతలు చేపట్టారు. సాయంత్రానికి పొలంలో ధాన్యం రాశి పోగుబడుతోంది. ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఇంత వరకు అధికారులు చర్యలు తీసుకోక పోవటం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వారం రోజులుగా ధాన్యం రాశులతో వల్లూరుపాలెం రైతులు వ్యాపారుల కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. సహజంగా మరో 20 రోజులకు కుప్ప నూర్పిళ్ళు మొదలవుతాయి. అయితే యంత్రాలతో కోసిన రైతుల ధాన్యం అమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకోవైపు అధికారికంగా ధాన్యం మద్దతు ధర ఇంత వరకు సమాచారం లేదని అధికారులు చెపుతున్నారు. గతేడాది బొడ్డపాడు, నార్తువల్లూరు, కుమ్మమూరు,దేవరపల్లి, రొయ్యూరు పిఎసిఎస్‌లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినా ప్రైవేటు వ్యాపారులు పోటీలు పడి కొనుగోలు చేశారు. కాని పెద్దనోట్ల రద్దుతో ఈ ఏడాది ప్రైవేటు వ్యాపారుల జాడ లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన అవశ్యకత ఏర్పడింది. చాలామంది రైతులు ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి ఇళ్ళవద్ద స్టాకు పెట్టారు. పది రోజుల కిందట యంత్రంతో కోతకోసి 150 బస్తాల ధాన్యాన్ని ఇంటివద్ద నిల్వ చేశానని రైతు ఆరేపల్లి శ్రీనివాసరావు చెప్పాడు. ప్రైవేటు వ్యాపారులు ఎవరు రావటంలేదని, ఒకరు మాత్రం బస్తా రూ.950లకు బేరమాడి డబ్బులు ఇప్పుడు చెల్లించలేమని, నెల రోజులు ఆగాలని తెలిపాడని అన్నారు. మరోరైతు రమణ పొలంలో ఎనిమిది ఎకరాల ధాన్యం రాశి ఉంది. ఇంకా చాలామంది రైతుల ధాన్యం రాశులు మండలంలో పలు గ్రామాల్లోని పొలాల్లో ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.