గుంటూరు

సుందరీకరణ పనుల జాప్యంపై కమిషనర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 5: విజయవాడ రోడ్డు సుందరీకరణ పనులు జాప్యం చేయడంపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం తన చాంబర్‌లో ఇంజనీరింగ్, పట్టణప్రణాళిక, అర్బన్ గ్రీనరీ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తొలుత విజయవాడ రోడ్డులో గ్రీనరీ ఏర్పాటు చేసేందుకు ఎన్ని పైపులైన్లు ఏర్పాటుచేశారు ?, ఎన్ని మొక్కలు ఏర్పాటుచేసినది ?, ఎన్ని స్ప్రింకర్లు ఏర్పాటుచేసినది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి అధికారులనుద్దేశించి మాట్లాడుతూ నిర్దేశిత సమయానికి కాంట్రాక్టు పనులను పూర్తిచేయకపోతే సంబంధిత కాంట్రాక్టర్లను తొలగించి వేరే కాంట్రాక్టర్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వారంలోగా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయాలని, వాటిని ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే కొత్తగా మొక్కలు నాటే ప్రాంతంలో తొలుత పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, అలాగే విజయవాడ రోడ్డు మార్జిన్లలో ఎలాంటి ఆక్రమణలు లేకుండా పట్టణ ప్రణాళికాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏమైనా ఆక్రమణలు ఉంటే తక్షణమే తొలగించి మరలా ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజయవాడ రోడ్డు సుందరీకరించే ప్రాంతాల్లో మొక్కలు పాడవకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, నగరంలోని డివైడర్లలో ఎన్నిచోట్ల గ్రీనరీ పనులు పూర్తిచేసిన వివరాలను తనకు అందజేయాలని ఆదేశించారు. అలాగే డివైడర్లలో యాడ్‌లు నిర్వహిస్తున్న యాడ్ ఏజెన్సీల వారే ఆయా డివైడర్లలోని గ్రీనరీని మెయిన్‌టైన్స్ చేసే విధంగా ఏజెన్సీల వారితో చర్చించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మానససరోవరం అభివృద్ధి కొరకు స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ప్లడ్‌లైవల్స్‌కు సంబంధించిన డ్రాయింగులను 10 రోజుల్లో తమకు అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్ ఇ గోపాలకృష్ణారెడ్డి, సిటిప్లానర్ ధనుంజయరెడ్డి, ఏసిపి హరిజానాయక్, ఈ ఈ రాంనాయక్, చినకోటేశ్వరరావు, వెంకట్రావు, అర్బన్ గ్రీనరీ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.