గుంటూరు

కలుషితం ఆహారం తిని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొల్లాపల్లి, డిసెంబర్ 5: కలుషిత ఆహారం భుజించడం వల్ల ఒకే కుటుంబంలో ముగ్గురు ఆస్వస్థకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మండలంలోని మాలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దేశావతు బద్దేనాయక్, అతని భార్య లక్ష్మీబాయి, కుమారుడు సోమ్లా నాయక్‌లు ఆదివారం రాత్రి కోడి మాంసంతోభోజనం చేశారు. అదే కూరతో పక్కింటి వారు కూడా భోజనం చేశారు. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా బద్దేనాయక్, లక్ష్మీబాయి, సోమ్లానాయక్‌లకు తీవ్రమైన కడుపులో తిప్పడం, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో హుటాహుటీన వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్సానంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీబాయి(40)మృతి చెందగా, భర్త బద్దే నాయక్, కుమారుడు సోమ్లానాయక్ అదే ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉందని బంధువులు తెలిపారు. ఈ విషయంపై బండ్లమోటు పొలీసులను అడుగగా తమ దృష్టికి రాలేదని తెలిపారు.

లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ ధ్యేయం
* మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు, డిసెంబర్ 5: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అన్నదాతను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా లాంలోని కృషీవిజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ మనిషికి విటమిన్లు లోపిస్తే వ్యాధులు ఎలా సంక్రమిస్తాయో, అదేరీతిన వ్యవసాయ భూమిలో సూక్ష్మపోషకాలు లోపిస్తే దిగుబడులు తగ్గుతాయని, దీన్ని అధికమించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసార పరీక్షలు నిర్వహించి 50 శాతం రాయితీతో సూక్ష్మపోషకాలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. భూ ఆరోగ్య కార్డులు జారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. వ్యవసాయాన్ని, దాని అనుబంధ రంగాలను కూడా ప్రభుత్వ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పిడి యాక్ట్ అమలు చేసి జైలుకు పంపించడంతోపాటు బాదిత రైతులకు నష్టపరిహారం కూడా యిప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పురుగుమందులలో కూడా కల్తీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 24 వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశామన్నారు. ఇప్పటివరకు 11 వేల కోట్ల రూపాయల మేర రైతులకు చెల్లించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ పనిముట్ల కొరత లేకుండా అవసరమైన మేరకు రైతులకు రాయితీతో వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 29 శాతం మేర తక్కువ వర్షపాతం నమోదైందని, వున్న సాగునీటిని సమర్ధవంతంగా వినియోగిస్తూ రైతులకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఈనెల 15 నుండి రెండవ తడి ఇస్తామన్నారు. తొలుత రైతులకు మంత్రి ప్రత్తిపాటి చేతులమీదుగా వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెసి-2 ఎం వెంకటేశ్వరరావు, గుంటూరు మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కృపాదాస్, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.