బిజినెస్

రూ. 5 వేలు దాటితే ఈ-చెల్లింపులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్, ఈ-పేమెంట్లను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సప్లయర్స్, కాంట్రాక్టర్లు లేదా సంస్థలకు జరిపే చెల్లింపులు 5,000 రూపాయలను మించితే నగదు రూపంలో ఇవ్వరాదని, ఎలక్ట్రానిక్ విధానంలోనే పేమెంట్లు జరపాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే. వీటి స్థానంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను చెలామణిలోకి తెచ్చినప్పటికీ, డిమాండుకు తగ్గ సరఫరా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో మోదీ సర్కారు డిజిటల్ పేమెంట్లకు పెద్దపీట వేస్తుండగా, ప్రభుత్వ శాఖల్లో దాన్ని కచ్ఛితంగా అమలు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయాన్ని ఆర్థిక శాఖ తీసుకుంది.