శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లా సైన్స్ మ్యూజియం ఎట్టకేలకు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, డిసెంబర్ 5: స్థల కేటాయింపులో వివాదం.. నిధుల విడుదలలో జాప్యం... నమూనాల ఏర్పాటుకు సందిగ్ధత వెరసి ఎన్నో బాలారిష్టాలను దాటిన జిల్లా సైన్స్ మ్యూజియం (జిల్లా వస్తు ప్రదర్శన శాల) ఎట్టకేలకు సోమవారం ప్రారంభమైంది. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట వద్ద జాతీయ రహదారిపై 1.25 కోట్లతో నూతనంగా నిర్మించిన ఈ మ్యూజియంలో నమూనాలు తిలకించేందుకు సోమవారం విద్యార్థులను అనుమతించారు. జిల్లా సైన్సు అధికారిణి రాధారాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాధారాణి మాట్లాడుతూ వస్తు ప్రదర్శన శాలలో మొత్తం 51 నమూనాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఇకపై విద్యార్థులను అనుమతిస్తామన్నారు. మంగళవారం, సెలవు దినాలు మినహా అన్ని రోజులు మ్యూజియం తెరిచే ఉంటుందన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులను అనుమతించనున్నట్లు ఆమె చెప్పారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను కూడా అనుమతిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతోపాటు ఆదివారం ఎవరైనా వచ్చి తిలకించవచ్చన్నారు. నమూనాల పనితీరు వివరించేందుకు వృత్తివిద్యా శిక్షకులు మొత్తం ఏడుగురిని నియమించినట్లు ఆమె వివరించారు. నమూనాలు తిలకించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 5 రూపాయలు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 10 రూపాయలు, బయట వ్యక్తులు 20 రూపాయలు రుసుం చెల్లించాలన్నారు. రోజుకు 250 మంది విద్యార్థులు మాత్రమే తిలకించేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా సైన్సు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నయనానందకరం.. శ్రీనివాసుని కల్యాణం
నెల్లూరు, డిసెంబర్ 5: టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్, ధర్మప్రచార మండలిల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని దర్గామిట్టలో ఉన్న టిటిడి కల్యాణ మంటపంలో సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణం నయనానందకరంగా జరిగింది. వేదార్చకుల వేద మంత్రాల నడుమ, శాస్తబ్రద్ధంగా, ప్రామాణికంగా, మేళతాళాల శ్రవణానందం కలిగేలా శ్రీవారి వివాహాన్ని సర్వభక్త జనరంజకంగా నిర్వహించారు. లోకకల్యాణం కోరుతూ నిర్వహించిన ఈ పుణ్యకార్యానికి ఎన్.బలరామనాయుడు దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. గుండాల గురవయ్య బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. కల్యాణం అనంతరం హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ధర్మప్రచార మండలి అధ్యక్షుడు సివి సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు కొండా శేఖర్‌రెడ్డి, సనత్‌కుమార్‌రెడ్డి, గిరిజాకుమారి, వేణుగోపాల్, వాకాటి జయకుమార్‌డ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నగర ప్రముఖులు బివి నరసింహం, వీరిశెట్టి హజరత్‌బాబు తదితరులు కార్యక్రమాన్ని తిలకించిన వారిలో ఉన్నారు.