శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సింగిల్‌విండో ద్వారా అనుమతులు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 5: తాగునీటి ఉత్పత్తిలో (ప్యాక్డ్ వాటర్) తాగునీటి ఉత్పత్తిదారులకు ఐఎస్‌ఐ, ఇతర శాఖల అనుమతులను సింగిల్‌విండో విధానం ద్వారా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సంబంధిత అధికారిని ఆదేశించారు. సోమవారం గోల్డెన్ జూబ్లీ సమావేశ మందిరంలో తాగునీరు వాటర్ ప్లాంట్ యాజమాన్యాలతో, తహశీల్దార్‌లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అధిక శాతం మంది తాగునీరు వాటర్ ప్లాంట్‌దారులు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నాణ్యత అంశాల ప్రకారం తయారుచేయడం లేదన్నారు. నీరు స్వచ్ఛంగా లేకపోతే అనేక వ్యాధులు వస్తాయని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సామాజిక బాధ్యతతో తాగునీరు వాటర్‌ప్లాంట్ వారు నాణ్యతలను పాటించాలని ఆదేశించారు. వాటర్ బబుల్స్‌ను పరిశుభ్రం చేయడం లేదని, దీనివలన ప్రజలు అనారోగ్యం పాలవుతారన్నారు. వాటర్‌ని క్యాన్‌లలో నింపేటప్పుడు క్యాన్‌లు పరిశుభ్రంగా కడగడంతోపాటు తాగునీరు వాటర్‌ప్లాంట్ ప్రాంతం పరిశ్రుభంగా ఉంచాలన్నారు. తాగునీరు వాటర్ ప్లాంట్‌దారులకు కొద్ది సమయం ఇస్తామని, ఆ సమయంలో వారు ఐఎస్‌ఐ సర్ట్ఫికెట్‌ను పొంది దానికి అనుగుణంగా ప్యాక్డ్ వాటరు తయారుచేసి ప్రజలకు ఇవ్వాలన్నారు. ఐఎస్‌ఐ నిబంధనల ప్రకారం ప్రతి వాటర్ ప్లాంట్ ఒక మైక్రో బయాలజిస్ట్, ఒక కెమిస్ట్రీని నియమించాలన్నారు. నిబంధనలు పాటించకుండా వాటర్ ప్లాంట్ నడిపితే, అటువంటి ప్లాంట్‌ను రద్దుచేసే అధికారం తహశీల్దార్లకు ఉంటుందని, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాటర్‌ప్లాంట్ ఉత్పత్తిదారులు ఐఎస్‌ఐ సర్ట్ఫికెట్‌ను తీసుకొని దానికి అనుగుణంగా తాగునీటిని తయారుచేసి అమ్ముకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వి ఆనందరావు, తహశీల్దార్లు, వాటర్‌ప్లాంట్ యజమానులు పాల్గొన్నారు.