శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరుకు ఎస్సీ, ఎస్టీ నిధులు రూ. 4.47కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, డిసెంబర్ 5: నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 4.47 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. సోమవారం ఆత్మకూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి కామినేనితో కలసి పొంగూరు పర్యటించారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్‌చార్జి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై విన్నవించారు. అందులో భాగంగా పురపాలక సంఘ కార్యాలయ భవన నిర్మాణం కోసం 1.5కోట్ల రూపాయలు కావాలని కోరారు. వాణిజ్య దుకాణాల సముదాయ భవనానికి 1.1 కోట్ల రూపాయలు కావాలని విన్నవించారు. క్రీడా స్టేడియం నిర్మాణం కోసం మూడుకోట్ల రూపాయలు, పాత పంచాయతీ బస్టాండ్ పునః నిర్మాణం కోసం కోటి రూపాయలు, పట్టణంలో అంతర్గత సిమెంట్ రోడ్లకు 20.4 కోట్ల రూపాయలు కావాలని కోరారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద 2.52 కోట్ల రూపాయలు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద 1.9కోట్ల రూపాయలు కావాలని కోరారు. కూరగాయల మార్కెట్‌కు అప్రోచ్‌రోడ్డు, సైడ్ కాలువలు, ప్రహరీగోడ నిర్మిత్తమై 88లక్షల రూపాయలు కావాలని విన్నవించారు. నెల్లూరుపాళెం కూడలి నుంచి పట్టణంలోని సోమశిల సెంటర్ వరకు సెంట్రల్ లైటింగ్ పనుల నిమిత్తం 85 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. వీటన్నింటిపై తరువాత పరిశీలిస్తామని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని మాత్రం మంజూరు చేస్తున్నట్లు అప్పటికప్పుడే ప్రకటించారు. ఈ ప్రకటనపై ఆత్మకూరు పురపాలక సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాగి వనమ్మ, సంధాని సంయుక్తంగా హర్షం వెలిబుచ్చారు.

31 ఎర్రచందనం దుంగల స్వాధీనం
* ఇద్దరు స్మగ్లర్లు, ఐదుగురు కూలీల అరెస్ట్
మర్రిపాడు, డిసెంబర్ 5: మర్రిపాడు పోలీసులు 31 ఎర్రచందనం దుంగల్ని, ఇద్దరు స్మగ్లర్లు, ఐదుగురు కూలీలను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సిఐ ఖాజావలి వెల్లడించారు. సోమవారం సాయంత్రం మర్రిపాడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మర్రిపాడు ఎస్సై సోమయ్య తన సిబ్బందితో కలసి సరిహద్దు ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగల రాశి వద్దకు తరలి వెళ్లారన్నారు. ఈ దాడిలో మర్రిపాడు మండలం పడమటినాయుడుపల్లి పంచాయతీలోని అనంతపురం గ్రామానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లు, ఐదుగురు కూలీలను అరెస్ట్ చేశారని చెప్పారు. షేక్ షబ్బీర్, వెంకటేష్, శోకా వెంకటేశ్వర్లు, శ్రీను, గొడ్టేటి లక్ష్మయ్య, గొట్టేటి పోలయ్య, రవీంద్రబాబు అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ పేర్కొన్నారు.

ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ పేదలకు ఓ వరం
* మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడి
ఓజిలి, డిసెంబర్ 5: మండలంలోని పెదపరియ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు నూతనంగా మంజూరైన భవన శంకుస్థాపనకు సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ పేదలకు ఓ వరం లాంటిదన్నారు. ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పెద్ద పెద్ద వ్యాధులకు పైసా ఖర్చు లేకుండా ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా సిఎం చంద్రబాబు ఏ మాత్రం రాజీ పడకుండా రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి సహకారంతో సిఎం రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు అడుగుడుగునా అడ్డు పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, సూళ్లూరుపేట టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి పరసా రత్నం, జిల్లా బిజెపి అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, టిడిపి నాయకులు వల్లూరు సూర్యప్రకాశరావు, జి విజయకుమార్ నాయుడు, సర్పంచ్ సునీత, బిజెపి యువమోర్చా జిల్లా అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ప్రసాద్, డిఎంహెచ్‌ఓ వరసుందరం, పివో డిటి రమాదేవి, వైద్యాధికారిణి అరుణ, టిడిపి, బిజెపి కార్యకర్తలున్నారు.