కృష్ణ

భారత దేశం వేద భూమి-ఆచార జ్యోతి ఆంధ్ర భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 6: భారతదేశం వేదభూమి, ఆచార జ్యోతి ఆంధ్రభూమి అని పరమహంస పరివ్రాజకాచార్య, కంచికామకోటి పీఠం ఉత్తర పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజి అన్నారు. పరమహంస పరివ్రాజకాచార్య, కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామీజితో పాటు ఉత్తర పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజి పట్టణానికి విచ్చేశారు. స్థానిక గొడుగుపేట శంకర మఠంలో మంగళవారం రాత్రి ఆయన అనుగ్రహ భాషణం చేశారు. శంకర భగవత్పాదులు 32 సంవత్సరాల వయసు లోపు యావత్ భారతదేశంలో పాదయాత్ర చేశారన్నారు. ఆయన చేసిన ఉపదేశాలు, భాష్యాలు, ప్రవచనాలు, స్తోత్రాలు విశ్వానికి మార్గదర్శకాలన్నారు. రాగ, ద్వేష రహితమైన జీవితం గడపాలన్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు. అక్షరాభ్యాసం శివ పంచాక్షరితో చేస్తారన్నారు. వేద భావాలను అవగాహన చేసుకుంటూ పవిత్రమైన జీవితం గడపాలన్నారు. యోగాభ్యాసం, అష్టాంగ సాధన వలన సాధ్యపడుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో శంకరమఠం పరిపాలనాధికారి పురాణం రామకృష్ణశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.