ఆంధ్రప్రదేశ్‌

వౌలిక సదుపాయాలకు రూ. 1,275 కోట్ల హడ్కో రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. రాజధానిలో వౌలిక సదుపాయాల కల్పనకు గాను హడ్కో సంస్థ తొలి విడతగా 1,275 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈసందర్భంగా మంగళవారం ఉదయం హడ్కో రుణ మంజూరు పత్రాన్ని అ సంస్థ ప్రాంతీయ ముఖ్య అధికారి ఎల్‌విఎస్ సుధాకర్ బాబు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్‌కు అందజేసారు. రాజధాని నిర్మాణానికి గాను హడ్కో మొత్తం 7వేల 500 కోట్ల రూపాయలను రుణం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొనగా ఇందులో భాగంగా తొలివిడతగా వెయ్యి 275 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపారు. గత సంవత్సరం విశాఖపట్నం లో జరిగిన భారత పరిశ్రమల శాఖ (సిఐఐ) సమావేశం లో రుణ ఒప్పందం జరిగిందని, రాజధాని అమరావతి లో రోడ్డు, ఇతర వౌళిక సదుపాయాలకు వినియోగించనున్నామని, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. హడ్కో డెప్యూటీ జనరల్ మేనేజర్ కెఎ రమణ్, సిఆర్‌డిఎ అకౌంట్స్ డైరెక్టర్ కె పాలేశ్వరరావు, ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.