ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల సమస్యలపై సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు ‘అర్చక గ్రీవెన్స్’ సమావేశాలు మూడు ప్రాంతాల్లో నిర్వహించాలని ఎపి దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ కమిషనర్ వైవి అనూరాధ పేరుతో ఇటీవలే ఒక మెమో జారీ అయింది. ఈ నెల 15 న విజయవాడలో జరిగే సమావేశంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ నెల 20 న విశాఖపట్నంలో జరిగే సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొనాల్సి ఉంది. అలాగే ఈ నెల 27 న కర్నూలులో జరిగే సమావేశానికి రాయలసీమలోని నాలుగు జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొని వారి సమస్యలపై నివేదన చేసే అవకాశం కల్పించారు. అర్చక సంక్షేమనిధి ట్రస్ట్ అధ్యక్షుడు ఐవైఆర్ కృష్ణారావు, దేవాదాయ కమిషనర్ వైవి అనూరాధ గీవెన్స్ సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే ఆ యా ప్రాంతాలకు చెందిన రీజనల్ జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సహాయ కమిషనర్లు పాల్గొంటారు.
ఎపి అర్చక సమాఖ్య విజ్ఞప్తి మేరకు గ్రీవెన్స్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. అర్చకులు ఎవరైనా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే వాటిని ఈ సందర్భంగా కృష్ణారావు, అనూరాధ దృష్టికి తీసుకురావాలని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు కోరారు. అర్చకులంతా తమ సమస్యలను మొదట జిల్లాల్లో ఉండే సహాయ కమిషనర్ల దృష్టికి తేవాలని, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే గ్రీవెన్స్ సమావేశం దృష్టికి తేవాలని సూచించారు. అర్చక సర్వీస్ భూమి అనుభవందారు కాలమ్‌లో అర్చకుల పేర్లను నమోదు చేయడం, నెలకు 10 వేల రూపాయల వేతనం, అర్చక సంక్షేమ నిధి పథకం వినియోగ సమస్యలు, పడితరం బకాయిలు, ట్రస్ట్‌బోర్డుల ఏర్పాటు, సర్వీసు భూమి అమ్మకంపై చేసిన డిపాజిట్‌పై వడ్డీ ఇవ్వడం తదితర అంశాలను గ్రీవెన్స్ సమావేశాల్లో పరిశీలిస్తారని ఆత్రేయబాబు, రాంబాబు తెలిపారు. దేవాదాయ శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని అర్చకులంతా వినియోగించుకోవాలని కోరారు.