ఆంధ్రప్రదేశ్‌

అడుగంటుతున్న తుంగభద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 6: కర్ణాటక, ఆంధ్ర రైతుల జీవనాధారమైన తుంగభద్ర జలాశయం త్వరలో డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. మంగళవారం నాటికి జలాశయంలో కేవలం 9.6 టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 7.5 టిఎంసిల దిగవకు చేరుకోనేగా డెడ్‌స్టోరేజిగా ప్రకటిస్తారు. జలాశయంలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో సీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు నీరందే పరిస్థితి లేకుండా పోయింది. నెలన్నర క్రితమే హెచ్చెల్సీకి నీటి సరఫరా నిలిచిపోయింది. అప్పటికే హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలోని పిఎబిఆర్‌కు 10.75 టిఎంసిల నీటిని తరలించి నిల్వ చేశారు. ఈ నీటిని అనంతపురంతో పాటు కడప జిల్లాలో తాగునీటి అవసరాల కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించారు. అలాగే ఉరవకొండ, సమీప మండలాల్లో పంటలు రక్షించేందుకు మరో 1.5 టిఎంసిల నీటిని ఆయకట్టుకు విడుదల చేశారు. పిఎబిఆర్‌లో నిల్వ ఉంచిన నీటితో ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలోని చెరువులు, చెక్ డ్యామ్‌లు నింపారు. కుడి కాలువ ద్వారా 15 చెరువులు, దక్షిణ కాలువ ద్వారా 22 చెరువులను నీటితో నింపారు. అలాగే రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలోని మరో 10 చెరువులు నింపే అవకాశం ఉందని హెచ్చెల్సీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పిఎబిఆర్‌లో 1.7 టిఎంసి నీరు నిల్వ ఉంది. టిబి డ్యామ్ నుంచి నీటివాటా నిలిచిన నేపథ్యంలో అనంతపురం జిల్లాతో పాటు కడప జిల్లాకు హెచ్‌ఎల్‌సి ద్వారా అదనంగా ఇప్పట్లో తాగునీరు అందే అవకాశం లేదు. దీంతో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పథకం ద్వారా తొలి దశలో జీడిపల్లికి చేరిన నీటితో పాటు అదనంగా వచ్చే నీటిని తాగునీటి కోసం వినియోగించాలని జల వనరులశాఖకు హెచ్చెల్సీ అధికారులు నివేదిక సమర్పించారు. కనీసం 11 టిఎంసిల నీటిని హంద్రీ నీవా ద్వారా ఇవ్వగలిగితే అనంతపురం, కడప జిల్లాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడొచ్చని సూచించారు. కనీసం 2.5 టిఎంసిల నీరు ఇవ్వగలిగితే వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం హంద్రీ నీవా ద్వారా కృష్ణాజలాలను తగినంత మేరకు లిఫ్ట్ చేసే అవకాశం కనిపించడంలేదు. దీంతో 11 టిఎంసిల నీరు రావడం గగనంగా మారనుంది. ఇప్పటికే హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వనందున భూములన్నీ బీడుగా మారాయి. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని టిబి డ్యామ్ నుంచి బోర్డు నిర్ణయం మేరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో హెచ్చెల్సీకి తెచ్చారు. హంద్రీ నీవా నీటిని తరలించకపోతే తాగునీటికి కష్టాలు తప్పవు.

తుంగభద్ర జలాశయం (పాతచిత్రం)