తెలంగాణ

సర్కారు కళ్లు తెరిపిస్తాం : ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఏకకాలంలో రైతుల రుణ మాఫీ చేయాలని సంతకాల సేకరణ, విద్యార్థుల ఫీజుల రీయంబర్స్‌మెంట్ వంటి సమస్యలపై ఆందోళనలు చేపట్టినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజులుగా గాంధీ భవన్‌లో జిల్లాల వారీగా పార్టీ ముఖ్యులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు 20 వేల మంది రైతులకు తగ్గకుండా రుణ మాఫీపై సంతకాలు సేకరించాలని పార్టీ నాయకులకు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు సూచించినట్లు ఆయన వివరించారు. అదనంగా 3 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా రైతులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఆయన విమర్శించారు.
విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని సుమారు 3200 కళాశాలల్లో వివిధ వర్గాలకు చెందిన సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు 3500 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. 2.5 లక్షల మంది లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని ఆయన తెలిపారు.
ఎఐసిసి ఆదేశానుసారంగా గత నెల 19 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 19వ తేదీ వరకు ఇందిరా గాంధీ శత జయంతడి వేడుకలు నిర్వహించడం ప్రారంభించిన4ట్లు ఆయన తెలిపారు. కొత్త జిల్లాల అధ్యక్షుల నియామకం కోసం సూచనలు, సలహాలు ఈ నెల 8వ తేదీలోగా తమకు లిఖితపూర్వకంగా అందజేయాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినోత్సవం రోజున సోనియా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసినందున ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సోనియా గాంధీ కృతజ్ఞతా దినంగా నిర్వహించనున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

చిత్రం..అంబేద్కర్‌కు నివాళులర్పిస్తున్న పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి