ప్రకాశం

నగదు రహిత లావాదేవీలపై అవగాహన అవసరం:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 6: దేశ భవిష్యత్తు నేటి యువతపై ఆధారపడి ఉందని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ పేర్కొన్నారు. మంగళవారం వివిధ కాలేజిలకు చెందిన విద్యార్ధులు, ఎన్‌సిసి యూనిట్లు , కళాకారులతో నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటరులో నగదురహిత లావాదేవీలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ విద్యార్ధులు, యువతలో ఎవరికీ లేనంత ఎంతో వ్యత్యాసాలు ఉందన్నారు. గతనెల 8వతేదీ కేంద్రప్రభుత్వం ఐదువందలు, వెయ్యిరూపాయల కరెన్సీనోట్లను ఉపసంహరించిందన్నారు. దీంతో ఎంతో క్లిష్టమైన పరిస్ధితి వచ్చిందన్నారు. ఈ పరిస్థితులను కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరమైన సలహాలు,సూచనలు,పరిష్కారమార్గాలు అందిస్తున్నాయన్నారు. దీన్ని సమర్ధవంతంగా ఎదుర్కొవాలంటే నగదురహిత లావాదేవీలవైపు ప్రతిఒక్కరు దృష్టిపెట్టాలన్నారు. భౌతికంగా నగదు ఇవ్వటం కాకుండా మొబైల్ బ్యాంకింగ్‌ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, ఒక బ్యాంకుఖాతానుండి మరొకబ్యాంకు ఖాతాలోకి నగదును సులభంగా బదిలీచేయవచ్చునని తెలిపారు. మాములు ఫోన్‌ద్వారా అంతర్జాలం లేకుండా మొబైల్ బ్యాంకింగ్ చేయవచ్చునని తెలిపారు. విద్యార్థులు, యువత మొబైల్‌బ్యాంకింగ్‌పై అవగాహన చేసుకుని వారి తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికికూడా వివరించాలన్నారు. ఈవిషయాన్ని ఉద్యమరూపంలో విస్తృతంగా సాగాలన్నారు. అందరు కలిసి ప్రతిఒక్కరికి తెలియచేయాలన్నారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ నగదురహిత లావాదేవీలు చేయటం మంచిపద్దతి అని విద్యార్ధులంతా మద్దతు తెలియచేస్తున్నందుకు అభినందించాలన్నారు. కాలేజిల ప్రిన్సిపాల్స్,పాఠశాలల ప్రదానోపాధ్యాయులు సెల్‌పోన్‌ద్వారా బ్యాంకింగ్‌విదానాలపై విద్యార్ధులకు పూర్తిగా అవగాహనకల్పించాలని తద్వారా వారి తల్లిదండ్రులు శిక్షణపొంది నగదురహిత లావాదేవీలకు అలవాటుపడతారన్నారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతోపాటు డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీకాలేజి, శర్మడిగ్రీకాలేజి, ఎస్‌ఆర్‌కె డిగ్రీకాలేజి, జివికెఆర్ డిగ్రీకాలేజిల ఎన్‌సిసి యూనిట్లు, ,విద్యార్థులు పాల్గొన్నారు.
అద్దంకిలో..
అద్దంకి: నగదు రహిత లావాదేవీలపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని ఎన్‌టిఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మలాది రత్తయ్య కోరారు. మంగళవారం కళాశాల విద్యార్ధిని, విద్యార్ధులు అద్దంకి పట్టణంలో నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా రత్తయ్య మాట్లాడుతూ నల్లధనం నిర్మూలించేందుకు నగదు రహిత లావాదేవీలు ఉత్తమమైన మార్గమన్నారు. ప్రతిఒక్కరు డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, రూపీ కార్డు లాంటి వాటి ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించాలని కోరారు. బస్సు ప్రయాణం దగ్గర నుండి, చిల్లరకొట్టు, బట్టలషాపు, కరెంటు బిల్లు, ఇంటిఅద్దెలు తదితరాలన్నీ నగదు రహిత లావాదేవీలు చేయడం సులువైన మార్గమని, ప్రతిఒక్కరు ఆన్‌లైన్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.