ఆంధ్రప్రదేశ్‌

కష్టాన్ని నమ్ముకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 12.23 శాతం మేరకు వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పాలనలో సగ భాగం పూర్తి చేశానని, హాఫ్ ఇయర్లీ పరీక్ష పెట్టుకున్నామని తెలిపారు. సిఎం తన రెండున్నర ఏళ్ళ పాలనలో చోటు చేసుకున్న వృద్ధి, అభివృద్ధి గురించి వెలగపూడి సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని చేసే విధానంలో రాజీ ఉండబోదన్నారు. గడచిన సంవత్సరంలో 10.99 శాతం వృద్ధి సాధించామని, ఈ ఏడాది దాన్ని అధిగమించామని తెలిపారు. దేశంలోనే ఇంత వృద్ధి సాధించిన రాష్ట్రం మరొకటి లేదన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. 2022 నాటికి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా నమోదు అయిందని, కానీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పంటను కాపాడుకోగలిగామన్నారు. హార్టికల్చర్‌లో 18.3 శాతం వృద్ధి సాధించామన్నారు. అక్వాకల్చర్‌కు ఎపి హాబ్‌గా మారిందన్నారు. నగర జనాభా విషయంలో కొంత వెనుకబడి ఉన్నామన్నారు. పశు సంపదలో 17.82, అడవుల్లో 2.6, పరిశ్రమల్లో 9 శాతం, గనుల్లో 10, సర్వీసెస్‌లో 9.57, హోటల్ రంగంలో 9.2 శాతం, కమ్యూనికేషన్ రంగంలో 8.3, ఫైనాన్స్ రంగంలో 8.76 శాతం వృద్ధి నమోదైందన్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనిలో భాగంగా 5గ్రిడ్‌లను, 7 మిషన్‌లను తీసుకున్నామన్నారు. ప్రభుత్వ పనులకు ఇకపై ఎర్ర సిమెంట్‌ను సరఫరా చేస్తామని, ఈ సిమెంట్ పక్కదారి పడితే శిక్షిస్తామని హెచ్చరించారు. వృద్ధి రేటుపై పెద్దనోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. నోట్ల రద్దును తప్పుపట్టనని, కానీ తదనంతర పరిణామాలపై సరిగ్గా పర్యవేక్షించలేదన్నదే తన అభిప్రాయమని ఆయన అన్నారు. నోట్లరద్దు నేపథ్యంలో ప్లాస్టిక్‌మనీ వినియోగంపై తొలి సమావేశం ఈ నెల 8న ముంబయిలో జరుగనుందని, దీనిలో డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ఉత్తమ విధానాల అమలుపై సూచనలు రావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. పన్నులు తగ్గించడంలో హేతుబద్ధత ఉండాలని, కష్టపడి వృద్ధి సాధిస్తున్నా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో మాట తప్పితే సహించబోమన్నారు. కష్టాన్ని నమ్ముకున్నామని, ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. వైకాపా నేత జగన్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. పోలవరం పూర్తి అయితే తనకు భవిష్యత్తు ఉండదన్న ఆలోచనతో జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 2013చట్ట ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కూడా నిధులు ఇస్తామన్నారు. 2030 నాటికి 169అంశాలపై లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలన, వాతావరణంలో వస్తున్న మార్పులను అంచనా వేయడం వంటివి చేపడుతున్నామన్నారు. పోటీ ప్రపంచంలో రాష్ట్రం ఎక్కడున్నదన్నది తెలుసుకునేందుకు తాము తీసుకుంటున్న చర్యలు దోహదపడతాయన్నారు.