తెలంగాణ

కామినేని ఆసుపత్రిలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం, డిసెంబర్ 7: వైద్యుడు దేవుడితో సమానమంటారు..చేతులెత్తి మొక్కుతారు. అలాంటి వైద్యులే కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల పాలిట యమదూతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ దారుణ ఘటన నగరంలోని ఎల్బీనగర్‌లోగల కామినేని ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పది రోజుల క్రితం స్వాతి అనే గర్భిణిని ప్రసవం కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. అయితే ప్రసవం తరువాత తల్లీ, బిడ్డలను కుటుంబ సభ్యులకు చూపకుండా ఆసుపత్రి యాజమాన్యం దాచింది.
దీంతో బుధవారం స్వాతి కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయడంతో తల్లి,బిడ్డలను చూపెట్టారు. తీరా చూస్తే పుట్టిన పాపకు సిజేరియన్ సందర్భంగా తలకు గాయమై ఉంది. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచింది.
దీంతో ఆసుపత్రి సిబ్బంది తీరుపై స్వాతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఆసుపత్రి డైరెక్టర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా డైరెక్టర్ అందుబాటులో లేరు.