కృష్ణ

గురుకుల పాఠశాలలుగా సంక్షేమ హాస్టళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, డిసెంబర్ 7: ఆంధ్ర రాష్ట్రంలో రానున్న మూడు సంవత్సరాలలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఆయా ప్రాంతాలలో గురుకుల పాఠశాలలుగా రూపాంతరం చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు. పామర్రు మండలం ఉరుటూరులో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.13కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన రాష్ట్ర స్థాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు ప్రభుత్వ గురుకుల వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 189 ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 89వేల మంది విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారన్నారు. ఆయా కార్పొరేషన్‌ల అభివృద్ధికి కార్పొరేషన్‌లు, ఫైనాన్స్ కార్పొరేషన్‌లు, ఫెడరేషన్‌లు ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేట్ విద్య అందరికీ అందాలని, ముఖ్యంగా పేద, బడుగు వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలనే సదుద్దేశంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల విద్యాలయాలను నెలకొల్పుతున్నామన్నారు. విద్య, వసతి, ఆహారం, పుస్తకాలు, దుస్తులు అన్నీ ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పామర్రు నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి ఎప్పుడూ ఉంటుందని రావెల వెల్లడించారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య, ఎమ్మెల్సీ ఎవిఎస్ రామకృష్ణ, జెడ్పీటిసి పొట్లూరి శశి, ఎంపిపి దగ్గుపాటి ఉష, వైస్ ఎంపిపి లాజరస్, మాజీ ఎంపిపి జి లక్ష్మీదాస్, యార్డు చైర్మన్ ఎం శంకరబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పి విజయశేఖర్, ప్రిన్సిపాల్ కంచర్ల లక్ష్మయ్య, మండల సర్పంచుల సంఘ అధ్యక్షురాలు కె స్వప్న తదితరులు పాల్గొన్నారు.