తెలంగాణ

డిండి ప్రాజెక్టుకు దండిగా నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 14: వర్షాభావం, కరవు పరిస్థితులతో నీరులేక వెలవెలబోతున్న డిండి ప్రాజెక్టుకు ఇక జలకళ రానుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించి డిండికి దండిగా నీరు అందించనున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని లక్ష్మాపురం చెరువు నుండి డిండి రిజర్వాయర్‌కు నీటి విడుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ సన్నాహాలు చేస్తుండటంతో డిండి ప్రాంత ప్రజల్లో, రైతుల్లో కొత్త ఆశలను రేపుతుంది.
డిండి ప్రాజెక్టు ఎగువన సరైన వర్షాలు లేక, వరద నీరు అందక డిండి రిజర్వాయర్ మూడునాలుగేళ్లుగా అడుగంటిపోయింది. కొద్దోగొప్పో వరద నీరు చేరినా మున్నాళ్ల ముచ్చటగా కనిపించి అడుగంటి పోవడం సాధారణమైంది. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టం సైతం పాతాళానికి పడిపోతోంది. డిండి రిజర్వాయర్‌ను నింపి కరవుపీడిత దేవరకొండ, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో ఎస్‌ఎల్‌బిసిలో అంతర్భాగంగా నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నక్కలగండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండటం, అటు సీఎం కెసిఆర్ శంకుస్థాపన చేసిన డిండి ఎత్తిపోతల పథకం పనులు సైతం ఇంకా భూసేకరణ దశను దాటకపోవడంతో కష్టాలు అలాగే ఉన్నాయి. డిండి రిజర్వాయర్ మరికొన్నాళ్ల పాటు జలకళకు దూరంగా ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డిండికి నీటిని తరలించాలని నిర్ణయించారు. దీంతో డిండికి జలకళ రానున్నది.
రెండు వారాల్లో జలకళ?
మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల మూడవ లిఫ్ట్ పరిధిలోని 47వ కిలోమీటర్ నుండి ప్రస్తుతం ఉప్పునూతల మండలంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మాపురం చెరువుకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండగానే కాలువకు నీటిని తరలించి 18 కిలోమీటర్ల దూరంలోని నల్లగొండ జిల్లా డిండి రిజర్వాయర్‌కు కృష్ణా నీటిని గ్రావిటీ ద్వారా తరలించనున్నారు. 0.5 టిఎంసిల నీటిని డిండి రిజర్వాయర్‌కు తాగునీటి అవసరాల పేరిట విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. అయితే లక్ష్మాపురం చెరువు నుండి డిండికి నీటి విడుదల ప్రక్రియకు మరో పక్షం రోజులైనా పడుతుందని భావిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల నుండి డిండి రిజర్వాయర్‌కు నీటి తరలింపు ప్రతిపాదన పాతదైనా ఇటీవల ఈ ప్రతిపాదనపై అటు ప్రభుత్వం, ఇటు విపక్షాలు దృష్టి సారించాయి. డిండి ఎత్తిపోతల పథకం ఆలస్యమవుతుండటంతో తాత్కాలికంగా కల్వకుర్తి లిఫ్ట్‌తో డిండికి నీటి తరలించాలని ప్రభుత్వం ఆలోచన చేయడంతోపాటు ఈ ప్రాంత ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్ పట్టుదల కూడా తోడైంది. ఈ నేపధ్యంలో త్వరలోనే డిండికి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు చేరనుండటం ఈ ప్రాంత సాగునీటి రంగంలో మరో ముందడుగుగా చెప్పవచ్చు.
chitram....
అడుగంటిన డిండి ప్రాజెక్టు రిజర్వాయర్