అక్షర

కొత్త ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తబాణీ
ప్రయోగ పద్యాలు
కవి- ఎలనాగ;
వెల: రు.50;
ప్రతులకు-
అన్ని పుస్తకాల షాపులు
**
తెలుగు కవిత్వంలో నూతన ప్రయోగాలు కొత్తేమీ కాదు. ప్రయోగ వైవిధ్యం కవిత్వవ్యాప్తికి దోహదంచేసి వైశిష్ట్యాన్ని వెల్లడిస్తుంది. అయితే కొందరు ప్రయోగాల కవిత్వాన్ని గారడీ కవిత్వంగా తీసిపారేశారు. దీనికి కారణం ప్రయోగం ‘అతి’కావటం, వికటించడం. ఎలనాగ కవిత్వ రహస్యాలు తెలిసిన కవి. అనువాద నిపుణులు. అధ్యయనం, పరిశీలన కలవారు కాబట్టి ఈ ‘కొత్తబాణీ’ రచించారు. ఇందులో ఆయన చేసిన ప్రయోగం వికటించినది కదా- రూపమేదైనా కవిత్వం ఉండాలన్నదే ఉద్దేశంగా కనబడుతుంది.
‘‘ఒక రాగం చెవిలోపలా/ మనసులో ఓదార్పుగా తాకుతుంది’’
- ఇది వచన కవితగా కనిపిస్తున్నా ‘మత్త్భేం’ ఛందస్సులో ఒదిగిపోయింది. వచన కవిత ఛందస్సుకి వ్యతిరేకమైనది, ఛందస్సు సంకెళ్ళను వదిలించుకొన్నది అన్న అభిప్రాయాల్ని ఈ పుస్తకం తోసేస్తుంది. వాడుక భాషకి కూడా ఛందస్సు ఉపకరిస్తుందని పూర్వకవులు చాటి చెప్పారు. ఈ ఎలనాగ వచన కవితను వృత్తపద్యాలలో రచించి కొత్త ఒరవడికి నాంది పలికారు. వచన కవిత పద్యాలకు లొంగదన్నవారికి ఈ కవితా సంపుటి చక్కటి సమాధానం.
‘‘పుస్తకమే నయం/ కుమిలిపోయిన ఆత్మల మీద
ప్రేమతో కాస్త ప్రమోదరశ్మిని/
సుఖాన్ని, ప్రతుష్ఠిని చల్లుతుంది’’
అనే కవిత అక్షరాలా వచన కవిత. అయితే ఎలనాగ దీనిని ఉత్పలమాలతో అలంకరించారు. ఈ వినూత్న ప్రయోగం స్వాగతించదగినది.

-ద్వా.నా.శాస్ర్తీ