తెలంగాణ

ఫార్మాసిటీకి కాలుష్య పరిశ్రమల తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 1160 పరిశ్రమలు కాలుష్య పరిధిలో వస్తాయని గుర్తించామని, వీటిని ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల ప్రతిపాదిత ఫార్మాసిటీ వద్దకు తరలించాలని నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద కుమార్ తెలిపారు. ఇప్పటికే 385 పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలకు తరలించామన్నారు. మంగళవారం ఆయన పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో పరిశ్రమల తరలింపుపై సమీక్షించారు. నగర పరిసరాల్లో కాలుష్య పరిశ్రమలు అనుమతించే ప్రసక్తిలేదన్నారు. ఇప్పటికే తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్ధ కాలుష్య పరిశ్రమలపై నివేదిక ఇచ్చిందన్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు, ఇపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.