అవీ .. ఇవీ..
గగనంలో ఆతిథ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 December 2016
భారతి
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/25u25.jpg?itok=aDhN4GAn)
ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే వంటావార్పు, తిండీతిప్పలతో విసుగొచ్చేస్తుంది ఎవరికైనా. ఒక్కోసారి బయట హోటల్స్‌కు వెళ్లి తింటే కాస్తంత ఉత్సాహం వస్తుంది. ఎప్పుడూ హోటల్‌కేనా...ఏదో ఒక్క కొత్తదనం లేకపోతే జీవితం బోర్ కొట్టేస్తుందనేవారూ ఉంటారు. అదిగో..అలాంటివారికోసం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఓ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఓ 50 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన గాజుభవంతిపై, గాలిలో వేళ్లాడుతున్నట్లు భ్రాంతి కలిగించే ఓ హోటల్ ఏర్పాటు చేశారు. చుట్టూ చెట్టూపుట్టా, జంతువులు ఉండేట్లు బొమ్మలూ అమర్చారు. అంతే ఇప్పుడు అదో పెద్ద ఆకర్షణగా మారిపోయింది. తిండికి తిండి.. వినోదానికి వినోదం, కొత్తదనానికి కొత్తదనం వినియోగదారులను రా..రమ్మని పిలుస్తోంది.