ఆంధ్రప్రదేశ్‌

సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక క్లస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 27: సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయాలని విదేశీ వాణిజ్య వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కలోక్ త్రివేది అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై ఆక్వా రంగ ప్రతినిధులతో విశాఖలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చేపట్టినట్టు తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించడంతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తుల ఎంపిక, వాటి ఉత్పత్తి, పరిశోధనలు, నాణ్యత వంటి అంశాలపై ఎగుమతి దారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న సముద్ర ఉత్పత్తుల్లో 45 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయన్నారు. దీన్ని మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని, అందుకు కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
విదేశీ వాణిజ్యం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ పొన్నం కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతులకు సంబంధించి ఇఇసి కోడ్ ప్రాముఖ్యత, లైసెన్స్ పొందే విధానం వివరించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్రం 5 శాతం ఇనె్సంటివ్ ఇస్తోందన్నారు. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ ఆఫ్ కాపిటల్ గూడ్స్ పథకం కింద అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు వర్తిస్తుందని వివరించారు. జాయింట్ డైరెక్టర్ జనరల్ ఉన్ని కృష్ణన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని సమర్ధవంతంగా ఎదుర్కొని ఎగుమతులు చేపట్టే విధంగా మందుకు సాగాలని సూచించారు. కస్టమ్స్ సహాయ కమిషనర్ పివివిఎస్‌ఎస్ శ్రీనివాస్, ఎఫ్‌ఐఇఓ అసిస్టెంట్ డైరెక్టర్ సెల్వన్ యోగి, ఆంధ్రాబ్యాంకు ఎజిఎం వినోద్‌కుమార్ పట్నాయక్ తదితరులు పలు అంశాలపై ప్రసంగించారు.