తెలంగాణ

త్వరలో జిల్లాల్లో వెల్‌నెస్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, జర్నలిస్టులకు ఔట్ పేషెంట్లుగా చికిత్స అందించేందుకు ఈ నెల 17వ తేదీన వెల్‌నెస్ సెంటర్లను ప్రారంభించామని, త్వరలో జిల్లాల్లో కూడా ఈ తరహా సెంటర్లను ఏర్పాటు చేస్తామని వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. శాసనసభలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, జనరల్ మెడిసిన్, డెంటల్, ఆప్తమాలజీ, గైనకాలజీ, ఫిజియోథెరపి, యోగాకు సంబంధించిన అవుట్‌పేషెంట్ సేవలు, ఫార్మసీ, ప్రాథమిక ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రారంభంలో 14 కేంద్రాలు వనస్థలిపురం, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, గాంధీ, నిమ్స్ వద్ద హైదరాబాద్‌లో ఆరు కేంద్రాలు, జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఈ కేంద్రాలకు వచ్చి వైద్య సేవలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్య చికిత్సలను పొందవచ్చన్నారు. దీనికి సంబంధించి అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు.