బిజినెస్

మొండి బకాయల ఊబిలో ప్రభుత్వరంగ బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశీయ బ్యాంకింగ్ రంగ ఉనికిని మొండి బకాయలు ప్రశ్నార్థకం చేస్తున్నాయ. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు మొండి బకాయల సెగ అధికంగా తగులుతోంది. వీటిలో ఎస్‌బిఐ ముందు వరుసలో ఉండగా, తర్వాతి వరుసలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. ఎస్‌బిఐ నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) విలువ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 55,807 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో ఇది 27,590.6 కోట్ల రూపాయలుగా ఉంది. ఏడాది వ్యవధిలో రెండింతల య్యాయ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండి బకాయల విలువ 2015-16లో 35,422.6 కోట్ల రూపాయలుగా, 2014-15లో 15,396.5 కోట్ల రూపాయలుగా ఉంది. దీని మొండి బకాయలూ రెండింతలకుపైగానే పెరిగాయ. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలిపింది. కాగా, గడచిన రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం 21 ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయల వివరాలను ఆర్‌బిఐ విడుదల చేసింది. వీటిలో తక్కువగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరర్థక ఆస్తులున్నాయ. 2015-16లో బ్యాంక్ మొండి బకాయల విలువ 2,949.5 కోట్ల రూపాయలుగా ఉంటే, 2014-15లో 2,266 కోట్ల రూపాయలుగా ఉన్నాయ.