మహబూబ్‌నగర్

రాజకీయాల కోసమే ప్రతిపక్షాల రాద్ధాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాబుపేట, జనవరి 2: ప్రతిపక్ష పార్టీలు కేవలం తమ రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను యావత్తు భారతదేశంలోని ప్రముఖులంతా ప్రశంసిస్తుంటే తమ రాజకీయ ఉనికిని కోల్పోతామనే భయంతో ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన అయ్యప్ప స్వాముల మహాపడిపూజ, టిఆర్‌ఎస్ మండల కార్యాలయం, షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రధాన మంత్రి నరేంద్రమోదితో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ప్రశంసించారని, అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆ ప్రశంసలను జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ప్రతిపక్షాలతో పాటు రాజకీయ ఐకాస కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. నాగం కోర్టులో పిటిషన్ వేయడం వల్లే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలుకు ఆటంకాలు ఎదురయాయ్యని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం అమలు చేస్తున్న అబివృద్ధి,సంక్షేమ పథకాలు ఆగిపోవని ఆయన అన్నారు. ప్రజలు ప్రభుత్వం అమలుచేస్తున్న అబివృద్ధి సంక్షేమ పథకాల గురించి పూర్తి అవగాహాన కలిగి ఉండాలని ఎవరుఎంటో ప్రజలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈసందర్బంగా 54మంది లబ్దిదారులకు షాదీముబారక్,కళ్యాణ లక్ష్మి పథకాల చెక్కులను మంత్రి పంపీణీ చేశారు.

ప్రజల కష్టాలు తీర్చడంలో కేంద్రం విఫలం
కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతాం : పిసిసి ఉపాధ్యక్షురాలు, ఎమ్మెల్యే అరుణ

మహబూబ్‌నగర్, జనవరి 2: నోట్లను రద్దు చేయడంతో ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారని అయితే ప్రదానమంత్రి యాభైరోజుల తర్వాత ప్రజలు కష్టాలు ఉండవని చెప్పడం ఇంకా కరెన్సీ కష్టాలు తొలగిపోలేదని అందుకు ప్రధానమంత్రి భాద్యత వహించాలని టిపిసిసి ఉపాధ్యక్షురాలు, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, మాజి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి, నియోజకవర్గాల ఇంచార్జిలు పవన్‌కుమార్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, కృష్ణ, డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్‌తో పాటు కాంగ్రెస్ సినియర్ నాయకులు భేటీ అయి నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై చర్చించారు. ఏ ఐసిసి నిర్ణయించిన ఆందోళన కార్యక్రమాలను జిల్లాలో చేపట్టాలని నాయకులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ కరెన్సీ కష్టాలపై ప్రజలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఈ నెల 7వ తేదిన మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ నోట్ల రద్దుపై ఖుషి ఖుషిగా ఉన్నారని ఇందులో ఏమీ మర్మం దాగుందో తెలియజెప్పాలన్నారు. నోట్ల రద్దు తర్వాత మూడు రోజుల పాటు ఫాంహౌస్‌లో ఉండి నోరు మేదపని ముఖ్యమంత్రి ఢిల్లీకి మాత్రం ఖుషిగా వెళ్లి మళ్లీ ఖుషిగా తిరిగివచ్చారంటే ఇందులో ఎదో తతంగం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కరెన్సీ కష్టాలు తీర్చడంలో ప్రధానమంత్రి పెలవగా అందుకు మద్దతు పలికిన ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఘోరంగా దెబ్బతిన్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కష్టాలను తీర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అదేవిధంగా డిసిసి కార్యాలయంలో పిఆర్‌టియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ప్రత్యక్షమయ్యారు. రాబోయే ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా అవకాశం కల్పించాలంటూ జైపాల్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరిపారు. ఇందుకు కాంగ్రెస్ నేతలు కూడా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చిద్దామని హామీ ఇచ్చారు.