మెయిన్ ఫీచర్

పశ్చాత్తాపం చిత్తశుద్ధికి నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తిని ‘మీరు రోజూ దేవుడిని ఏమని కోరుకుంటారు అని అడిగితే...’ ఈరోజు నాకు ఏ విషయంలోను, ఎవరి ముందూ పశ్చాత్తాప పడాల్సిన అవ సరం రాకుండా చూడమని కోరుకుంటాను’అని సమాధానం చెప్పాడట. విన గానే ‘ఇదేం కోరిక’ అనిపిస్తుంది గానీ... ఆలోచిస్తే దాని వెనక అర్థం చాలా ఉంది. ఎవరైనా పశ్చాత్తాపం ఎప్పుడు పడతారు.. ఏదయి నా తప్పు చేసి నప్పుడు.. తన పరుషపు మాటలతో, పనులతో ఎవరినయినా మానసికంగా బాధ పెట్టినప్పుడు, అవమానించినప్పుడు! ‘ఆ పని తనవల్ల జరగ కూడదు’అన్నదే ఆ ప్రార్థన అర్థం.
అరిషడ్వర్గాలు అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కామ, క్రోధ, మోహ, లోభాలు మహామహుల మనసులలోనూ జొరబడి.. వాళ్ళను వివశులనో, క్షణి కావేశపరులనో చేస్తుం దనటానికి మన ఇతిహాసాలలో, పురాణాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా యి. ఎంత గొప్ప మనిషి అయినా ఒక్కోసారి సమయ సందర్భాలనుబట్టి కోపా వేశాలకు గురికావటం, ఒళ్ళు తెలియని ఆ స్థితిలో ఎదుటివాళ్ళను నిందించటం చేస్తూ ఉంటాడు. ఆ వేడి చల్లారాక మళ్ళీ అంతలోనే మామూ లు స్థితికి వచ్చి పశ్చాత్తాప పడటం తను బాధ పెట్టిన ఆ వ్యక్తిని క్షమాపణలు కోర డం చేస్తూ ఉంటాడు. కానీ అలాంటి సమయంలో అతను ఎంత వేదనను అనుభ విస్తాడన్నది మాటలలో చెప్పటం సాధ్యం కాని విష యం. అందుకే ‘పశ్చా త్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేద’ని పెద్దలు అన్నది. అది శారీరక శిక్షలయిన కొర డాదెబ్బలు, కారాగారం కన్నా బాధా కరమైనవి. అంతటి బాధ నుండి ఆ రోజంతా తప్పు కోవాలంటే పశ్చాత్తాప పడవలసిన పరిస్థితి అతనికి కలగకూడదు. ఆ పరిస్థితి రాకూ డదంటే అతను ఆ రోజంతా ఎవరినీ బాధ పెట్టకూడదు.. అందుకే ఉదయం లేవగానే దేవుడిని ఆ కోరిక కోరుకునేది!
కొంతమంది తమ మాట తీరుపట్ల, తన శరీర భాష పట్ల, తన ప్రవర్తన పట్ల వాళ్ళకు ఇసుమంత కూడా స్పృహ ఉండదు. ఎదుటివాళ్ళను బాధపెట్టడమే పనిగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. తెలిసి ‘కావా’లని ఎదుటివాళ్ళను హిం సించే దుష్టస్వభావులు కొందరయితే.. మంచిచెడుల విచక్షణ లేక అజ్ఞానంతోనో, అమా యకత్వంతోనో ఎదుటి వాళ్ళను బాధపెట్టేవాళ్ళు మరికొందరు. వీళ్ళకు పశ్చాత్తాపం అంటే ఏమిటో.. అది మనసును ఎంతగా మెలిపెడుతుందో ఏ ఒక్కరోజూ అనుభవానికి రాదు. అందుకే దేవుడిని భౌతిక సుఖాలకు సంబం ధించిన కోరికలు తప్ప ఇలాంటి కోరికలు కోరరు.. ఆ ఆలోచన కూడా వాళ్ళ మనసుకు అందదు.
మనిషి జీవితంలో ఎన్నో అవస్థలు, ఎన్నో దశలు, మరెన్నో మలు పులు, ఒడిదుడుకులు ఉంటాయి. బాల్యావస్థ అమా యకత్వంతో, కౌమారం అయో మయంతో... యవ్వనం తెలిసీ తెలియని తనంతో గడిచిపోతాయి. ఈ అవస్థ లలోనే మనిషి అను కోకుండానో, అక స్మాత్తుగానో, ప్రతికూల పరిస్థితులలోనో కొన్ని తప్పులుచేసే ప్రమాదం ఉంటుంది. ఇవి జీవితాంతం పశ్చాత్తాపానికి గురిచేస్తూ.. భౌతికంగా, మాన సికంగా ప్రభావం చూపించి మనిషిని కృం గదీ స్తాయి. అలాంటి దుస్థితి బారినపడకుండా ఉండా లంటే చిన్నత నంనుంచే తలి లదండ్రుల రక్షణ, ఉపాధ్యాయుల శిక్షణ, స్వచ్ఛ సమాజపు అండ దండలు, భవిష్యత్ భరోసా ఇవన్నీ చాలా అవసరం. అవన్నీ లభించి నాణ్య మైన జీవితాన్ని అతను కొనసాగిస్తూ అడుగులు ముందుకు వెయ్య గలి గినప్పు డు దేవుడు కూడా తన ‘ఒక’వంతు బాధ్యతను నిర్వ హిస్తూ జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాప పడాల్సిన అవసరాన్ని అతనికి రాని వ్వడు. మనిషి మనీషిగా, మహర్షిగా ఎద గాలంటే అతనిలో స్వార్థం కొంతయినా తగ్గి, మనసులో మంచితనం పెరిగి.. ఎదుటి వాళ్ళను గురించి ఆలో చించగ లిగేలా గుండె ఆర్ద్రత చెందగలగాలి. అప్పుడే ‘పశ్చా త్తాపం’ అనేది అనుభ వానికి ఆమడ దూరలో ఉండి ఉన్న తునిగా అతనిని తీర్చిదిద్దుతుంది. ఒకవేళ ఏదయినా కార ణాలవల్ల తప్పు జరిగి పోవటం, తనవల్ల ఎవ రికయినా నష్టం, కష్టం కల గటం జరిగితే.. పశ్చా త్తాప పడటం సంస్కార వంతుని లక్షణం. అలా చేస్తే ఇనుమును నిప్పులో కాల్చి వంచినట్లుగా- బంగారాన్ని మంటలో కాల్చి శుద్ధి చేసినట్లుగా మన సు కూడా పరిశుభ్రంగా కడిగిన ముత్యంలా మారి పోతుంది. తప్పు చేయ టంకన్నా చేసిన తప్పును ఒప్పు కోక పోవడం.. సవరించు కోక పోవడం మరింత పెద్ద తప్పు. అది చిత్తశుద్ధికి మాయని మచ్చ. పిండి తార్థం ఏమిటంటే తప్పు చేయనే కూడదు.. ఒకవేళ చేస్తే పశ్చాత్తాప పడాలి.. చేసిన తప్పు కు క్షమాపణలు అడగాలి.. అది మనిషి కనీస బాధ్యత.

కొంతమంది తమ మాట తీరుపట్ల, తన శరీర భాష పట్ల, తన ప్రవర్తన పట్ల వాళ్ళకు ఇసుమంత కూడా స్పృహ ఉండదు. ఎదుటివాళ్ళను బాధపెట్టడమే పనిగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. తెలిసి ‘కావా’లని ఎదుటివాళ్ళను హింసించే దుష్టస్వభావులు కొందరయితే.. మంచిచెడుల విచక్షణ లేక అజ్ఞానంతోనో, అమాయకత్వంతోనో ఎదుటి వాళ్ళను బాధపెట్టేవాళ్ళు మరికొందరు. వీళ్ళకు పశ్చాత్తాపం అంటే ఏమిటో.. అది మనసును ఎంతగా మెలిపెడుతుందో ఏ ఒక్కరోజూ అనుభవానికి రాదు.

- శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు