బిజినెస్

ఐఎన్‌ఎక్స్ మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, జనవరి 9: దేశంలోనే తొలి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఐఎన్‌ఎక్స్)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఇక్కడి గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ (గిఫ్ట్) సిటీలోగల ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సి) వద్ద మోదీ చేతులమీదుగా ఐఎన్‌ఎక్స్ మొదలైంది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) అనుబంధ సంస్థే ఈ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజ్ (ఐఎన్‌ఎక్స్). కాగా, మోదీ ఓపెనింగ్ బెల్ మోగించడంతో ఇండెక్స్, స్టాక్స్ తదితర ఈక్విటీ డెరివేటివ్, కరెన్సీ డెరివేటివ్, కమాడిటీ డెరివేటివ్‌లలో ప్రాథమికంగా ట్రేడింగ్ మొదలైంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘వేగవంతమైన లావాదేవీలకు, నాణ్యమైన సేవలకు, నూతన ప్రమాణాలకు ఈ ఎక్స్‌చేంజ్ నాంది పలుకుతుంది.’ అన్నారు. ‘జపాన్ ఎక్స్‌చేంజ్‌లు మొదలయ్యాక ఆరంభమయ్యే ఐఎన్‌ఎక్స్.. అమెరికా మార్కెట్లు ముగిశాకే ముగుస్తుంది.’ అని చెప్పారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఐఎన్‌ఎక్స్ నడుస్తుందన్నారు. ఇక బిఎస్‌ఇ చైర్మన్ సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక సేవల్లో బిఎస్‌ఇ ఓ దిక్సూచి అని అన్నారు. ఇదిలావుంటే ఐఎన్‌ఎక్స్ సోమవారం ప్రారంభమైనప్పటికీ, ఈ నెల 16 నుంచి ట్రేడింగ్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలు కానున్నాయి. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు.
భీమ్ లావాదేవీల విలువ పెంపు?
న్యూఢిల్లీ: మరోవైపు భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (్భమ్) యాప్‌పై లావాదేవీల విలువను పెంచే వీలుందని ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం రోజుకు రూ. 20 వేల వరకు లావాదేవీలను అనుమతిస్తుండగా, ఇకపై ఇంతకుమించి లావాదేవీలను భీ మ్ యాప్‌పై చేసుకునే అవకాశాలున్నాయి. ఈ యా ప్ ప్రారంభమైన 10 రోజుల్లోనే కోటి డౌన్‌లోడ్‌లను అందుకుంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చేలా దీన్ని తెచ్చారు.