సంపాదకీయం

శుభంకర విక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మడి పువ్వుల మధ్య గొబ్బెమ్మలు... గొబ్బెమ్మల మధ్య పువ్వుల పరిమళాలు.. ఉత్సవం ‘ప్రతీక’.. సృష్టిగత సత్యాలకు ‘ప్రతీక’, సమాజస్థిత వాస్తవాలకు ‘ప్రతీక’, సమష్టి జాతీయ జీవన స్వభావానికి ‘ప్రతీక’. సంస్కార సమాహారానికి ‘ప్రతీక’... సంస్కార సమాహారం సంస్కృతి! ‘ప్రతీక’ ప్రధానం.. ‘ప్రతీక’ ద్వారా ప్రస్ఫుటించే సత్యం. సంస్కారం మరింత ప్రధానమైనది. ఇది స్వభావం... మకర సంక్రాంతి భూమికి అనుసంధానమై ఉన్న ఖగోళ వ్యవస్థలో సంభవించే వెలుగుల విప్లవానికి ప్రతీక! ఈ వెలుగుల విప్లవం మానవ నిర్మితమైన ‘కృత్రిమ పరివర్తన’ కాదు. నిరంతర కాలగమనంలో అనాదిగా సంభవిస్తున్న సృష్టిగత మధుర విక్రాంతి మకర సంక్రాంతి! అనంతంగా ఇది సంభవిస్తూనే ఉంటుంది! అందువల్ల మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి ఆరంభం వరకు భూమండలంపై ఉత్తరార్ధగోళం అంతటా ‘పగటి’ నిడివి పెరుగుతుంది. ‘రాత్రి’ కాల వ్యవధి తగ్గిపోతుంది. పగలు వెలుగునకు ప్రతీక. రాత్రి చీకటి స్వరూపం! ఈ సృష్టిగత పరివర్తన ప్రతి సంవత్సరం పునరావృత్తం కావడం అనాది, అనంతం! అందువల్లనే వెలుగును ప్రేమించి పూజించే హైందవ జాతీయులు, సంస్కారపు వెలుగులను అనాదిగా అవనికి ప్రసాదించిన భరతమాత బిడ్డలు మకర సంక్రాంతి రోజున ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి వెలుగు పెరగడానికి శుభారంభం! భూమి నుంచి దర్శించినప్పుడు సూర్యుడు ‘మకరరాసి’తో కలసి ఉదయించడం ఆరంభం కావడం మకర సంక్రణం! అప్పటి వరకూ చలికి మంచునకు దాదాపు రెండునెలల పాటు భూమండలంలోని ఉత్తరార్ధగోళం గడగడ వణికిపోవడం సృష్టిగత వాస్తవం! ‘‘అహములు సన్నములయ్యెను, దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యె నిశల్, బహుశీతోపేతంబై, ‘ఉహుహూ’ అని వడకె లోకముర్వీనాథా...’’ అని ఈ భరింపరాని ‘చలి’ని గురించి మహాకవి పోతన వర్ణించాడు! మకరరాసితో కలసి సూర్యుడు ఉదయించడం ఆరంభం కాగానే ఉత్తరార్ధ గోళంలో చలి తగ్గిపోతుంది. మంచు దుప్పటిని తొలగించుకుని భూమాత వెచ్చటి వెలుగులతో ‘వసంతం’వైపుప్రస్థానం ప్రారంభిస్తుంది. సన్నబడిన పగలు-అహము-పెద్దదైపోతుంది, ‘చలిమంట’ దహనము-తో జనానికి అవసరం తీరిపోతుంది. దీర్ఘమైన ‘రాత్రి’-నిశ-నిడివి తగ్గిపోయి వెలుగులు విస్తరిస్తాయి. అందువల్ల మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి ఆరంభం వరకూ నడిచే ‘సూర్యుని ఉత్తరాయణం’లో ఉత్తరార్ధగోళం వెలుగుతుంది. దక్షిణార్ధ గోళంలో ‘రాత్రి’ పెరిగి ‘పగటి’ నిడివి తగ్గుతుంది! అందువల్ల ‘మకర సంక్రాంతి’ ‘ఉత్తరార్ధగోళం’లోని ప్రజలందరికీ పండుగ రోజు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉండే భూమి ఉత్తరార్ధగోళం...
భారతదేశం ఇలా ఉత్తరార్ధగోళంలో ఉంది! ప్రపంచ దేశాలలో దాదాపు డెబ్బయిశాతం ఉత్తర్ధాగోళంలోనే ఉన్నాయి. ఈ అన్ని దేశాలలో ‘మకర సంక్రాంతి’ని పండుగగా జరుపుకొనడం లేదు. సృష్టిగత వాస్తవాల పట్ల, ఖగోళ పరిణామాల పట్ల, సృష్టితో మానవ సమాజానికి ఉన్న సమన్వయం పట్ల అనుబంధం పట్ల ఆయా విదేశాలకు అభిజ్ఞత, అవగాహన లేకపోవడం ఇందుకు కారణం. సృష్టిగత పరిణామాలను సమాజస్థిత జీవన ప్రస్థానంలో అనాదిగా సమన్వయం చేసుకోగలిగిన హైందవ జాతి ‘మకర సంక్రాంతి’ని గుర్తించి పండుగ జరుపుకొంటోంది! భూమి పరిభ్రమణ కారణంగా సాపేక్షంగా-కర్కాటక సంక్రాంతి నుంచి - దక్షిణ దిశగా జరిగిన సూర్యుడు మకర సంక్రాంతి నాడు తన ‘దక్షిణయాత్ర’ను ముగించుకుని ఉత్తర దిశా ప్రస్థానాన్ని ప్రారంభించడం మకర సంక్రాంతి! అందువల్ల సూర్యుడు క్రమంగా ఉత్తరార్ధ గోళానికి చేరువ అవుతాడు. వసంతం వికసించడానికి, ‘గ్రీష్మం’లో ఉష్ణోగ్రత పెరిగి వర్ష ఋతువుగా పరిణమించడానికి ఇలా చేరువ కావడం కారణం. అందువల్ల ‘మకర సంక్రాంతి’ మాధుర్యం ప్రాకృతిక ప్రస్థానానికి శుభారంభం...అది గ్రహించినవారు భారతీయులు! మకర సంక్రాంతి నాడు దక్షిణ ధ్రువ ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం.. ఉత్తర ధ్రువ ప్రాంతంలో అర్ధరాత్రి! ధ్రువములవద్ద ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. సృష్టిగతమైన అద్భుతమిది. మకర సంక్రాంతి నుంచి ‘ఉత్తర ధ్రువం’ క్రమంగా వేకువవైపు.. పగటివైపుపరుగులు తీస్తుంది. ‘దక్షిణ ధ్రువం’ సాయంత్రం వైపు.. చీకటివైపు జరుగు తుంది. మూడునెలల తరువాత ‘మేష’ సంక్రాంతి నాడు దక్షిణ ధ్రువంలో సూర్యుడు అస్తమిస్తాడు, ఉత్తర ధ్రువంలో శుభంకరమైన సూర్యోదయం అవుతుంది! ఈ రెండింటి మధ్య బిందువు మకర సంక్రాంతి. ఉత్తరాయణ శుభారంభం...
సంవత్సరం పొడవునా ‘మేష సంక్రాంతి’ మొదలు ‘మీన సంక్రాంతి’ వరకు పనె్నండు సంక్రాంతులు ఏర్పడడం విశ్వవ్యవస్థలో భాగం. సూర్యునికీ, నక్షత్రాలకు, నక్షత్రాలతో కూడిన ‘రాసు’లకు, భూమికీ, మధ్య అనాదిగా అనంతంగా ఉండే శాశ్వత-సనాతన-సంబంధం ఇందుకు కారణం! కానీ మకర సంక్రాంతికి ఇంత ప్రత్యేకత ఎందుకు? వెలుగుల రేడు సూర్యుడు ‘దక్షిణార్ధ గోళం’ నుంచి ఉత్తరం వైపు-సాపేక్షంగా-మళ్లుతున్నాడు. కనుక ఉత్తరార్ధగోళంలోని భారతీయులు సూర్యునికి స్వాగతం చెప్పడం మకర సంక్రాంతికి సందర్భం... ఇది సూర్యునితో ముడిపడిన పండుగ. సౌరమానం ప్రకారం జరిగే ఉత్సవం... ‘‘సూర్య ఆత్మా జగతః’’-జగత్తునకు సూర్యుడు ఆత్మ! సూర్యుని వల్లనే భూమి వెలుగుతోంది. నీటిని, వర్షాన్ని, నదులనూ పొందుతోంది, పచ్చని శోభలతో పరిమళిస్తోంది, ఫలిస్తోంది... మానవులకు మాత్రమే కాదు, సమస్త జంతు, వృక్ష జీవజాలానికి అన్నం ప్రసాదిస్తోంది. ప్రాణం ప్రసాదిస్తోంది. జీవన వికాసాన్ని ప్రసాదిస్తోంది. మానవ జీవన సంస్కృతికి భూమికగా సనాతనమైంది. అందువల్ల భూమి తల్లి. భూమిని పండిస్తున్న ఆకాశం తండ్రి.. అంటే ఆకాశ మధ్యముడైన సూర్యుడు తండ్రి...
తల్లిదండ్రులకు-్భమ్యాకాశాలకు-ఇలా కృతజ్ఞత తెలుపడానికి విశ్వవ్యవస్థలో సహజంగా ఘటించిన కాంతుల విప్లవం మకర సంక్రాంతి! మానవజీవితంలో ఇలా భూమిపై అంతరిక్షంపై సూర్యునిపై నక్షత్రాలపై గ్రహాలపై ఆధారపడి ఉందని గ్రహించిన హైందవజాతి యుగయుగాలుగా ప్రతి ఏటా ఇలా ‘మకర సంక్రాంతి’ని మహోత్సవంగా జరుపుకుంటోంది! భూమిని పండించి ధాన్యలక్ష్మిని ఇంటింటా నిలబెట్టే గోవంశంపట్ల ధాన్యలక్ష్మి స్వరూపమైన పరిసరాలపట్ల, ఆకుపచ్చని అందాలపట్ల, సమస్తానికీ ఆధారమైన భూమిపట్ల, భూమిని నడిపిస్తున్న సూర్యునిపట్ల సౌరకుటుంబం పట్ల విశ్వవ్యవస్థపట్ల భారతీయుల కృతజ్ఞతకు ప్రతీక మకర సంక్రాంతి.. శుభకాంతుల శోభన పతాక..