తెలంగాణ

మూసివేసిన వసతి గృహాలను తెరవకపోతే ప్రతిఘటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: మూసి వేసిన వంద వసతి గృహాలను వెంటనే తెరిపించకపోతే ఆందోళన బాట పడతామని, ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని 12 బిసి సంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో ఈ ఏడాది 59 ఎస్‌సి వసతి గృహాలను, 35 బిసి వసతి గృహాలను, 6 ఎస్‌టి వసతి గృహాలను ప్రభుత్వం మూసి వేసిందని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, జాతీ య బిసి విద్యార్థి సంఘం సమన్వయకర్త డాక్టర్ ఆర్. అరుణ్, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె. శ్రీనివాస్, తెలంగాణ బిసి కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు వై. సత్యనారాయణ, రాష్ట్ర బిసి ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్, బిసి యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, తెలంగాణ బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్. దుర్గయ్య, బిసి హక్కుల పోరాట కమిటీ అధ్యక్షుడు సి. రాజేందర్, బిసి సంఘర్షణ సమితి అధ్యక్షుడు టిఆర్ చంధర్, ఎస్‌సి, ఎస్‌టి, బిసి వసతి గృహాల అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తదితరులు తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అస్తవ్యస్త పాలనే కారణమని వారు ఆరోపించారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు పెంచడం లేదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. నాసిరకం భోజనం తినలేక విద్యార్థులు అనారోగ్యానికి గురై చదువు మానేస్తున్నారని, కొత్తగా విద్యార్థులు వసతి గృహాల్లో చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదని వారు తెలిపారు. ఇటువంటి ఇబ్బందులను ప్రభుత్వమే సృష్టించి విద్యార్థులు లేకుండా చేసి ఆ తర్వాత విద్యార్థులు లేరన్న వంకతో వసతి గృహాలను మూసి వేస్తున్నదని వారు దుయ్యబట్టారు. కాబట్టి ప్రభుత్వం మూసి వేసిన వసతి గృహాలను వెంటనే తెరవకపోతే తాము ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.