తెలంగాణ

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఇంటర్మీడియట్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు బోర్డు అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం లేదా మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టింది. అత్యధిక మార్కులను సాధించడం కోసం అడ్డదారులు తొక్కుతున్న ప్రైవేటు కాలేజీలకు ముకుతాడు వేసేందుకు చర్యలు చేపట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ఆట కట్టించేందుకు చర్యలు చేపట్టింది. ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు చేయనుంది. ఇందుకోసం పరీక్ష కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిఘా పెంచనుంది. పాత పద్ధతులకు స్వస్తి పలికి , సిసి కెమరాల మధ్య ప్రయోగపరీక్షలు నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లోనే ప్రశ్నాపత్రాలను జారీ చేయడం, సిసి కెమరాల నిఘా మధ్య ప్రయోగపరీక్షలు నిర్వహించడం ద్వారా కొంత అక్రమాలు తగ్గించవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా పరీక్ష పూర్తయిన వెంటనే పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్ధుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలని కూడా బోర్డు అధికారులు సూచించారు. ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ పర్యవేక్షణలో ఆన్‌లైన్‌లో ప్రయోగపరీక్షలు నిర్వహిస్తారు. ఈ చర్యలు మరింత పక్కాగా పరీక్షలు నిర్వహించేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఫిబ్రవరి 3 నుండి ప్రయోగపరీక్షలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 3 నుండి 22వ తేదీ వరకూ నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం కంటే గంట ముందు ఎగ్జామినర్లు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.