ఆంధ్రప్రదేశ్‌

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జనవరి 17: ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, ఒకరి పరిస్థితి విషమం కాగా, మరో ఇద్దరికి గాయాలైన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివేడు టానామిట్టవద్ద చోటుచేసుకుంది. బతుకుజీవనం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళివచ్చి స్వగ్రామంలో స్థిరపడాలని కొత్తఆటో కొనుగోలు చేసుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు పెద్దమండ్యం మండలం పాపేపల్లెకు చెందిన బావాసాబ్(60) అతని కుమారుడు అమీన్‌పీర్(38) బతుకుజీవనం కోసం గత కొంతకాలంగా విదేశాలలో ఉండేవాడు. ఇటీవల కాలంలో స్వగ్రామానికి వచ్చిన అమీన్‌పీర్ ఇక్కడే ఏదైనా పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని తండ్రి బావాసాబ్, అదే గ్రామంలో ఉంటున్న చెల్లెలు కౌసర్(30), బావ పీరుల్లా, వారి కుమారుడు జునైద్(4), కుమార్తెలు కలసి మంగళవారం మదనపల్లెకు వచ్చారు. మదనపల్లెలో కొత్తఆటోను కొనుగోలు చేశారు. పీరుల్లా డ్రైవింగ్ చేస్తు స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యమంలో కురబలకోట మండలం ముదివేడు టానామిట్ట మలుపుప్రాంతంలో మదనపల్లె ఆర్టీసీ వన్‌డిపోకు చెందిన ఆర్టీసీబస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఆటోలో ఉన్న బావాసాబ్(60), ఆమీన్‌పీర్(38), చెల్లెలు కుమారుడు జువైద్(4) అక్కడికక్కడే మృతిచెందారు. పీరుల్లా(35), కౌసర్(30), కుమార్తెకు గాయాలు అయ్యాయి. వారిలో కౌసర్ పరిస్థితి విషమంగా ఉంది.