రాష్ట్రీయం

ఆస్లే మహిళలు ప్రార్థనలు చేసుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: చిత్తూరు జిల్లా గుర్రం కొండ గ్రామంలోని మసీదులో ముస్లింలలో ఆస్లేహెడెస్ తెగకు చెందిన మహిళలు ప్రార్థనలు చేసుకుంటారని, వారిని ఎవరూ భంగ పరచకుండా, ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. గుర్రంకొండ గ్రామానికి చెందిన ఎం సహీరా అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. గ్రామంలోని మసీదులోకి వెళ్లి తాము ప్రార్ధనలు జరుపుకోకుండా రాష్ట్ర సమాచార కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్ సోదరుడు, సర్పంచ్ అయిన నౌషద్ అహ్మద్ ఆటంకం కలిగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆమె కోర్టును కోరారు. గ్రామ సర్పంచ్ తీరుపట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మహిళలకు రక్షణ కల్పిస్తామని, వారి హక్కులు పరిరక్షిస్తామని తెలిపారు. అనంతరం హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు మూడు వారాలు గడువు ఇచ్చింది.