బిజినెస్

‘ఆధార్’ పేమెంట్లను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) సిఫార్సులు చేస్తోంది. డిజిటల్ లావాదేవీల కోసం బయోమెట్రిక్ విధానాన్ని (ఆధార్ కార్డులను) వాడేలా వ్యాపారులను ప్రోత్సహించాలని, ఇందుకు తగ్గట్లుగా ప్రోత్సాహకాలు వస్తే బాగుంటుందని యుఐడిఎఐ సిఇఒ అజయ్ భూషణ్ పాండే పిటిఐకి తెలిపారు. బ్యాంకుల వద్ద ఇప్పటికే ఖాతాదారుల ఆధార్ కార్డుల వివరాలున్నందున, వ్యాపార లావాదేవీలు ఆధార్ ఆధారిత చెల్లింపుల ద్వారా జరిగేలా చేయడం సులభమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను వ్యాపారులకు కొంత కమీషన్ వచ్చేలా చేయాలన్నారు.